Playstore Icon
Download Jar App
Digital Gold

మీకు డిజిటల్ గోల్డ్ ఎందుకు అవసరమో తెలిపే 10 కారణాలు – జార్ యాప్

December 28, 2022

బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మనకు ఒక కొత్త పద్ధతి ఉంది. అదే డిజిటల్ గోల్డ్. దీనిలో పెట్టుబడులు పెట్టడం చాలా సురక్షితం, సులభం. అసలు మీరు డిజిటల్ గోల్డ్​లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో తెలుసుకోవాలా? ఇది చదవండి.

3000 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన బంగారాన్ని భారతదేశంలో దేవుడి సొమ్ముగా భావిస్తారు.

చాలా మంది బంగారాన్ని బహుమతులుగా, ఆభరణాలు, ఆస్తులుగా, దేవాలయాలు, గురుద్వారాలు వంటి ప్రార్ధనా స్థలాలకు బహుమతులుగా ఇచ్చేందుకు ఉపయోగిస్తారు.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం భారతదేశమే.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రజలు ఆభరణాల దుకాణాలు లేదా బంగారం వర్తకులను కలిసేందుకు భయపడుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత భారతీయులు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. అదే డిజిటల్ గోల్డ్​.

ఆన్​లైన్​లో బంగారం కొనుగోలు చేసేందుకు ఈ తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి చాలా మందికి మంచి ఎంపికగా ఉపయోగపడుతోంది.

డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడులు పెట్టే కస్టమర్లకు ఇది చాలా మంచి ఎంపిక. భౌతిక బంగారం తొందరగా డెలివరీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ డిజిటల్ గోల్డ్​నే​ మంచి ఆప్షన్​ అవుతుంది.

డెలివరీ ఆప్షన్​తో బంగారాన్ని తీసుకోవాలని చూస్తున్న చాలా మంది వ్యక్తులకు డిజిటల్ గోల్డ్​ సరైన ఎంపిక. డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడులు పెట్టడం చాలా సులభం, అనుకూలం మరియు చాలా సులభం​గా పని పూర్తవుతుంది.

మీరు డిజిటల్ గోల్డ్​ను వెంటనే ఎందుకు కొనుగోలు చేయాలో తెలిపే ఓ 10 కారణాలు ఇక్కడ ఉన్నాయి..


1. రూ. 1 నుంచి కూడా మీరు పెట్టుబడులు పెట్టొచ్చు..

డిజిటల్ గోల్డ్​లో గొప్ప విషయం ఏంటంటే.. దీనిలో మీరు కేవలం రూ. 1 నుంచి కూడా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

మీరు మీ ఆర్థిక స్థోమతను బట్టి ఎంత కావాలంటే అంత మొత్తంలో కొనుగోలు చేసుకునేందుకు వీలుంటుంది. ఏ ఇతర రూపాల్లోని బంగారం అందించలేని సౌలభ్యాన్ని ఇది మీకు అందజేస్తుంది.


2. ఎటువంటి స్టోరేజీ, సెక్యూరిటీ సమస్యలు ఉండవు

భౌతిక రూపంలోని బంగారం​ విషయంలో మీరు బంగారాన్ని నిల్వ చేయాలంటే విడిగా ఒక లాకర్​ను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బంగారాన్ని ఇతరులు దొంగిలించే అవకాశం కూడా ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది.

కానీ డిజిటల్​ గోల్డ్​తో అటువంటి సమస్య లేదు. డిజిటల్ గోల్డ్​ స్టోరేజీకి ఎటువంటి భద్రతా సమస్యలు ఉండవు.

మీ అకౌంట్​లో ఉన్న ప్రతి గ్రాము బంగారానికి నిజమైన భద్రత ఉంటుంది. మీ పేరు మీద ఉన్న బంగారం​ లాకర్​లో చాలా భద్రం​గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిల్వ చేసిన బంగారానికి ఎటువంటి రిస్క్​ ఉండదు. ‍


3. మీరు ఏ సమయంలోనైనా బంగారాన్ని కొనొచ్చు, అమ్మొచ్చు

బంగారాన్ని ఒకానొక కాలంలో కరెన్సీగా వాడారు. ఇప్పటికీ బంగారం అంటే మార్కెట్​లో నమ్మకమైన పెట్టుబడిగా పేరుంది.

మీరు డిజిటల్ గోల్డ్​ను ఎప్పుడైనా ఎటువంటి ప్రాంతం నుంచైనా కొనుగోలు చేయొచ్చు, విక్రయించొచ్చు.

బంగారాన్ని మీరు అమ్మినపుడు అందుకు సంబంధించిన డబ్బులు నేరుగా మీ బ్యాంక్​ అకౌంట్​కి ట్రాన్స్​ఫర్ చేయబడతాయి. లేదా మీ రిజిస్టర్డ్​ వాలెట్​కు జత చేయబడతాయి.

భవిష్యత్​లో మీరు బంగారాన్ని అమ్మాలని భావించినపుడు దాని పూర్తి విలువను పొందేందుకు డీలర్​ను సంప్రదించాల్సిన అవసరం లేదు. బంగారం కొనుగోలు ఖాతాను కలిగి ఉండాల్సిన అవసరం లేదు.

4. మీకు తెలియకుండా దాచే ఫీజులు ఏవీ ఉండవు

డిజిటల్ గోల్డ్​ కేవలం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రమే విక్రయిస్తుంది.

ఇందులో ఎటువంటి తెలియని ఫీజులు ఉండవు. మీరు ఖర్చు చేసే మొత్తం డిజిటల్ గోల్డ్​లోనే పెట్టుబడి పెట్టబడుతుంది.

ఇక్కడ మీరు ప్రతి లావాదేవీకి కేవలం 3 శాతం జీఎస్టీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.


5. మీరు 24 క్యారెట్ల 99.99 శాతం స్వచ్చమైన బంగారాన్ని పొందుతారు

మీరు కొనుగోలు చేసే ప్రతీ గ్రాము బంగారం 24 క్యారెట్ల విలువను కలిగి ఉంటుంది. భారతదేశంలోని మూడు గోల్డ్​ బ్యాంకులు ఆగ్​మోంట్, MMTC PAMP, సేఫ్​గోల్డ్ లలో మీరు కొనుగోలు చేసిన బంగారం మీ పేరు మీద నిల్వ చేయబడుతుంది. 

మీ బంగారం చాలా భద్రంగా ఉంటుందని ఇది హామీ ఇస్తుంది. ఇది దొంగిలించబడుతుందా లేదా పాతబడి పోతుందా అని మీరు చింతించాల్సిన అవసరం ఉండదు. భౌతిక రూపంలోని బంగారం విషయంలో మాత్రమే మీకు ఈ భయాలు ఉంటాయి.

సేఫ్​గోల్డ్​ అనేది జార్ యాప్ గోల్డ్​ బ్యాంక్. మంచి నాణ్యత ఉన్న బంగారాన్ని మాత్రమే ఇది కొనుగోలు చేస్తుంది. ఇది జారీ చేసే అన్ని బంగారు నాణేలు ప్రభుత్వ ల్యాబుల​లో పరీక్షించినవి మాత్రమే ఉంటాయి.

99.99 శాతం 24 క్యారెట్ల బంగారంతో ఇవి ఉంటాయి. ప్రతీ నాణెం, బంగారం కడ్డీ జాగ్రత్తగా పరీక్షించబడుతుంది.

6. మీ బంగారాన్ని మీరు ఇంటికి డెలివరీ కూడా చేయించుకోవచ్చు

మీరు మీ డిజిటల్​ గోల్డ్​ను ఇంటికి తెప్పించుకోవాలనుకుంటే ట్యాంపర్ ప్రూఫ్ ప్యాక్​లో మీకు ఇంటి వద్దకే డెలివరీ అవుతుంది. ఇందుకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు.

7. డిజిటల్ గోల్డ్​ను సులభంగా ఆభరణాలకు మార్పిడి చేసుకోవచ్చు

ఇంతకు ముందు చర్చించిన విధంగా... బంగారం అనేది ఒక లిక్విడ్ కమోడిటీ. డిజిటల్​ గోల్డ్​ను సులభంగా ఆభరణాలుగా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది.

జార్ యాప్​ భాగస్వామి అయిన సేఫ్ గోల్డ్​ విషయంలో క్యారెట్​లేన్, తనిష్క్, క్యాడరే బై కల్యాణ్ భాగస్వాములుగా ఉన్నారు.

8. మీరు ఎప్పుడైనా, ఎవరికైనా బంగారాన్ని బహుమతిగా ఇవ్వొచ్చు

మీరు మీ ఇష్టమైన వారికి ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా, ఏ సమయంలో అయినా డిజిటల్​ గోల్డ్​ను బహుమతిగా ఇవ్వొచ్చు. ఇది చాలా బాగుంది కదా!

మీరు ఇతరులకు బంగారాన్ని బహుమతిగా ఇచ్చేందుకు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. జార్ యాప్​లో అది చాలా సులభమైన స్టెప్పుల్లోనే పూర్తవుతుంది. డిజిటల్ గోల్డ్​తో ప్రతీ సందర్భాన్ని గుర్తుండేలా తయారు చేసుకోండి. ‍

9. చాలా సులభంగా బంగారాన్ని కొనొచ్చు

మీరు వివిధ రకాల మొబైల్ యాప్​లు, యూపీఐ యాప్స్ ద్వారా, బ్యాంకుల ద్వారా డిజిటల్ గోల్డ్​ను కొనుగోలు చేయొచ్చు. ఉదా.. జార్, పేటీఎం, ఫోన్​పే, బజాజ్ ఫిన్​సర్వ్, మొబిక్విక్ వంటి ఇతర రకాల యాప్స్.

డిజిటల్ గోల్డ్​ను కొనుగోలు చేయడం చాలా తేలిక. అంతేకాకుండా దాదాపు 10 కోట్ల పైచిలుకు మంది ఇప్పటికే డిజిటల్​ గోల్డ్​ను సొంతం చేసుకున్నారు. మరి మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు.

10. ద్రవ్యోల్బణం, మార్కెట్ ఒడిదుడుకుల నుంచి బంగారం రక్షణనిస్తుంది

నిర్దిష్ట వడ్డీ వచ్చే పెట్టుబడులైన ఫిక్స్​డ్​ డిపాజిట్లు రాబడులను పెద్దగా తీసుకురాలేవు.

షేర్లు, ఈక్విటీలు బాగానే లాభాలను తీసుకొస్తాయి. కానీ అవి ఎప్పుడు లాభాలు తెస్తాయో, ఎప్పుడు నష్టాలు తెస్తాయో ఎవరికీ తెలియదు. కాబట్టి వీటి వలన రిస్క్​ చాలా ఎక్కువ.

ఇక రియల్ ఎస్టేట్ అనేది లిక్విడ్​ లేని దీర్ఘకాలిక పెట్టుబడి. ఇందులో ఎటువంటి లిక్విడ్ ఉండదు. కాబట్టి తీవ్ర అనిశ్చితి ఉంటుంది.

కానీ ఇదే సమయంలో బంగారం అనేది చాలా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. గడిచిన కొన్ని సంవత్సరాలలో బంగారం ధరలు దాదాపు 300 శాతం పెరిగాయి.

బంగారం కొరత కారణంగా రానురాను ఇది చాలా బలమైన పెట్టుబడిగా మారతుంది. మార్కెట్ ఒడిదుడుకులు ఇక్కడ అంతగా ఉండవు.

పెట్టుబడి అయినా సరే వాణిజ్యం అయినా సరే బంగారం మంచి ట్రాక్ రికార్డును కలిగి ఉంది. ఇది బలమైన పెట్టుబడిగా భావించబడుతోంది.

బంగారాన్ని హ్యండిల్ చేయడంలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ బంగారం మీద పెట్టుబడులు అనేవి భవిష్యత్​లో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం మంచి ఎంపిక​గా మారే అవకాశం ఉంది.

కాబట్టి బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే ఉత్తమ సమయం.

శతాబ్దాల నుంచి బంగారం మీద పెట్టుబడులు కొనసాగుతున్నాయి. బంగారం మీద పెట్టుబడుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీర్ఘకాలిక సంపదను సృష్టించాలనుకునే వ్యక్తులకు బంగారం మీద పెట్టుబడులు మంచి ఎంపిక అవుతుంది.

ఎవరైతే తమ పెట్టుబడులు చాలా సురక్షితంగా ఉండాలని అనుకుంటారో.. అటువంటి వారు డిజిటల్​ గోల్డ్​లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా ఉత్తమమైన ఎంపిక. దీని ద్వారా సంపదను కూడా సృష్టించుకోవచ్చు.

ఎందుకు ఇంత మంచి పెట్టుబడి అవకాశాన్ని వృథా చేసుకుంటున్నారు. వెంటనే జార్ యాప్ డౌన్​లోడ్ చేసి కేవలం రూ. 1 నుంచే బంగారం మీద పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. 

 

 

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.