Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
ఆన్లైన్ వేదికల నుంచి బంగారాన్ని కొనుగోలు చేసే సరికొత్త పద్ధతే డిజిటల్ గోల్డ్ (Digital Gold).
ప్రస్తుత కాలంలో బంగారాన్ని కొనాలని అనుకునేవారికి చాలా అనువైన, ఖర్చుపరంగా కూడా సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయ మార్గం ఇది.
మీరు కొనుగోలు చేసే ప్రతీ గ్రాము బంగారం కూడా, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మూడు గోల్డ్ బ్యాంకుల్లో ఏదైనా ఒకదానిలోని లాకర్లో 24 క్యారట్ల బంగారంగా నిల్వ చేయబడుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న గోల్డ్ బ్యాంకులు – Augmont | MMTC - PAMP | SafeGold.
ఇప్పుడు ఇన్వెస్టర్లు యాప్‌లోని బటన్‌పై ఒక క్లిక్ చేసి బంగారాన్ని కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా బంగారం మీ ఇంటికే డెలివరీ అయ్యేలా ఆర్డర్ కూడా చేయవచ్చు. మరో విషయమేంటంటే, డిజిటల్ గోల్డ్ (Digital Gold) ఎంత కొనుగోలు చేయాలనే పరిమితి కూడా ఏమీ లేదు. మీరు రూ. 1 విలువైన బంగారం కూడా కొనుగోలు చేయవచ్చు.
ఈ ఆర్టికల్‌లో, మేము అత్యంత విలువైన పసిడి లోహం యొక్క సరికొత్త రూపం గురించి ప్రతీ అంశాన్ని చర్చించాం.
మీరు ఒక నగల దుకాణానికి వెళ్లి, ఒక నిర్ధిష్ట ధరకు ఆభరణాలను కొనుగోలు చేశారని అనుకోండి.
మీకు ఆ ఆభరణం యొక్క పరిమాణం, నాణ్యత గురించి ఎలాంటి అవగాహన ఉండదు. పైగా, తయారీ చార్జీల పేరిట మరింత అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
ఆ ఆభరణాన్ని ఇంటికి తీసుకొని వెళ్లి భద్రంగా మీ లాకర్లో దాచి పెడతారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కదా?
అయితే, ఆ తర్వాత మీకు కింద పేర్కొన్న రెండు సందర్భాల్లో ఏదో ఒకటి ఎదురు కావచ్చు.
ఇప్పుడు, ఇది ఆలోచించడండి.
మీరు అదే పరిమాణంలో బంగారాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేశారు. అప్పుడు అది 24 క్యారట్ల బంగారంగా వాల్ట్‌లలో భద్రపరచబడింది.
ఇక్కడ మీరు తక్కువలో తక్కువ ఒక్క రూపాయిని కూడా పెట్టుబడి పెట్టవచ్చు. భవిష్యత్తులో దాన్ని మార్కెట్ ధరకు అమ్ముకోవచ్చు. లేదంటే మీ ఇంటికి భౌతికమైన బంగారం రూపంలో డెలివరీ చేయించుకోవచ్చు.
ఇదంతా, కేవలం మీ స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే చేయొచ్చు!
ఈ విధానం చాలా బాగుంది కదూ.. అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ విధానంలో మీరు మీ బంగారాన్ని భౌతికంగా కలిగి ఉండలేరు. మీ దగ్గర ఇంత బంగారం ఉందని పక్క వాళ్లకు చూపించలేరు.
చిన్న మొత్తాల్లో కొనుగోలు చేయగలగడం, సులభంగా డెలివరీ చేయించగల సౌలభ్యం, లిక్విడిటీ ఎంపికల వల్ల నవ యువకుల్లో, యువ భారతీయుల్లో డిజిటల్ గోల్డ్ (Digital gold) అంటే పాపులారిటీ పెరుగుతోంది.
మీరు ఏదైనా యాప్ నుంచి డిజిటల్ గోల్డ్ (digital gold) ను కొనుగోలు చేస్తున్నట్లు అయితే, నిజానికి మీరు మధ్యవర్తుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నట్లు. వారు పేరుగాంచిన కంపెనీలైన Augmont Gold Ltd, Digital Gold India Pvt. Ltd. – SafeGold మరియు MMTC-PAMP India Pvt. Ltd వంటి కంపెనీల నుంచి మీరు ఆ బంగారాన్ని యాక్సెస్ చేసుకునేలా సాయం చేస్తారు.
మీ డిజిటల్ గోల్డ్ (digital gold) భద్రంగా ఉండేలా చూసుకున్నందుకు గాను ఈ మధ్యవర్తులు మీ దగ్గర కొంత మొత్తాన్ని వసూలు చేస్తారు.
అలా ఏం జరగదు. షేర్ మార్కెట్ స్టాకుల మాదిరిగానే, మీ డిజిటల్ గోల్డ్ (digital gold) కూడా మీ పేరు మీద నమోదు అయి ఉంటుంది.
అంతేగాక, స్వతంత్ర ధర్మకర్తల ద్వారా బీమా చేయబడిన, ధ్రువీకరించబడిని వాల్టులలో భద్రంగా నిల్వ చేయబడుతుంది.
తద్వారా, మీరు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఉపయోగించిన యాప్ లేకుండా పోయినప్పటికీ కూడా మీ బంగారం చాలా భద్రంగా ఉంటుంది.
ఎవరైనా సరే, డిజిటల్ గోల్డ్ (digital gold)ను రిజిస్టర్డ్ యాప్స్, మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేయవచ్చు.
Jar App ద్వారా కూడా మీరు డిజిటల్ గోల్డ్ (digital gold)ను కొనుగోలు చేయవచ్చు. దీనిలో మీరు కేవలం ₹1 పెట్టుబడితో కూడా కొనొచ్చు.
NPCI, మార్కెట్లోని అత్యుత్తమ UPI ప్రొవైడర్ల మద్దతు ఉన్న Jar app, మీ సేవింగ్స్‌ను ఆటోమేటిక్‌గా బంగారంలో పెట్టుబడి పెడుతుంది. తద్వారా మీకు రోజువారీ పొదుపు పద్ధతిని అలవాటు చేస్తుంది. Jar Appను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
మీరు ఉపయోగిస్తున్న వేదికను బట్టి మీరు KYC లేకుండా నిర్దిష్ట పరిమితి వరకే డిజిటల్ గోల్డ్ (Digital gold)ను కొనుగోలు చేయొచ్చు.
కొన్ని ప్రముఖ యాప్స్‌లో ఎటువంటి KYC అవసరం లేకుండా రూ. 50,000 విలువ గల బంగారాన్ని కూడా కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.
Jar App విషయానికి వస్తే ఎటువంటి KYC అవసరం లేకుండా మీరు 30 గ్రాముల వరకు డిజిటల్ గోల్డ్ (digital gold)ను కొనుగోలు చేయొచ్చు.
ఈజీ లిక్విడిటీ, భద్రత, డెలివరీ ఎంపికలను బట్టి చూస్తే డిజిటల్ గోల్డ్ (digital gold)లో పెట్టుబడి పెట్టడం బాగానే అనిపిస్తుంది. దానికి ఉన్న ప్రతికూలతలు కూడా అంతగా పెద్దవి అనిపించవు.
మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసినంత సులభంగా డిజిటల్ గోల్డ్ (digital gold)లో పెట్టుబడి పెట్టవచ్చు. డిజిటల్ గోల్డ్ (digital gold)లో పెట్టుబడి పెట్టేందుకు కింద పేర్కొన్న సులభమైన స్టెప్పులను అనుసరించండి.
భౌతికంగా ఉన్న బంగారాన్ని అమ్మడం ద్వారా వచ్చిన లాభాలపై అది ఎన్ని రోజుల్లో అమ్మడం ద్వారా వచ్చిందనేదాన్ని బట్టి షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్నులు విధిస్తారు.
మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని (అది ఆభరణాలైనా, డిజిటల్ గోల్డ్ (digital gold) అయినా, లేదా నాణేలు అయినా కావొచ్చు) మీరు కొనుగోలు చేసిన తేదీ నుంచి మూడు సంవత్సరాల్లోపు అమ్మితే ఆ అమ్మకాలను Short-Term Capital Gains(STCG) గా పరిగణిస్తారు.
భౌతిక బంగారం, డిజిటల్ గోల్డ్ (digital gold) పెట్టుబడులకు పన్నుల విధానం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
భౌతిక రూపంలో బంగారాన్ని కొనలేని వారు, బంగారం మీద ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టలేని వారికి డిజిటల్ గోల్డ్ (digital gold) చాలా ఉపయోగపడుతుంది.
డిజిటల్ గోల్డ్ (digital gold) అనేది 99.9% 24 క్యారట్ల నాణ్యతతో లభిస్తుంది. Jar App ను ఉపయోగించి తక్కువలో తక్కువ ₹1 విలువైన బంగారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. అంతేగాక, ఈ బంగారాన్ని ఎక్కడ దాచాలా అని బాధపడాల్సిన అవసరం ఉండదు.
దీనికి మీకు కావాల్సిందల్లా ఒక్కటే.. మీ స్మార్ట్ ఫోన్లో Jar App. Jar యాప్‌లో మీరు మీ డబ్బును ఆటోమేటిగ్గా పెట్టుబడి పెట్టవచ్చు. Jar యాప్ గురించి తరచూ అడిగి ప్రశ్నల గురించి మరింత తెలుసుకోండి.
డిజిటల్ గోల్డ్ (digital gold) కొనుగోలు అవకాశం కల్పించే ఇతర ప్లాట్‌ఫామ్స్ నుంచి కూడా డిజిటల్ గోల్డ్ (digital gold) ను కొనుగోలు చేయవచ్చు.
డిజిటల్ గోల్డ్ (digital gold) ను తక్షణమే మార్కెట్ రేట్లకు కొనవచ్చు లేదా అమ్మేయవచ్చు. డిస్కౌంట్లు, మేకింగ్ చార్జీల గురించి ఆభరణాల దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
SEBI మరియు RBI ద్వారా రెగ్యులేట్ చేయబడుతున్న Gold Bonds మరియు Gold ETF ల వంటి డిజిటల్ గోల్డ్ (digital gold) రూపంలో కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టవచ్చు.
దీనిలో ఉండే ఫ్లెక్లిబిలిటీ కారణంగా తక్కువ సమయం పాటు పెట్టుబడి పెట్టాలని చూసే వారు SGBలలో పెట్టుబడి పెట్టేకంటే డిజిటల్ గోల్డ్ (digital gold) లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.
డిజిటల్ గోల్డ్ (digital gold) ను SGBలా కాకుండా మీరు కొనుగోలు చేసిన ప్లాట్ఫామ్లో తక్షణమే కొనుగోలు చేయొచ్చు, అమ్మేయవచ్చు.
SGBలు 8 సంవత్సరాల కాలపరిమితితో ఉంటాయి. జారీ చేసిన తేదీ నుంచి 5 సంవత్సరాల తర్వాత మాత్రమే మీరు వీటిని సొమ్ము చేసుకునేందుకు వీలుంటుంది.
అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ లేదా ETFల విషయానికి వస్తే పలు కంపెనీలకు మీరు అధిక చార్జీలను చెల్లించాల్సి వస్తుంది.
చివరగా, తక్కువ మొత్తంలో పెట్టుబడులతో ప్రారంభించాలని అనుకునేవారికి డిజిటల్ గోల్డ్ (digital gold) అనేది మంచి ఎంపిక అవుతుంది. ఇది చాలా భద్రంగా ఉంటుంది కూడా.
డిజిటల్ గోల్డ్ (digital gold) లో గొప్ప విషయం ఏంటంటే.. దానితో పాటు వచ్చే ఫ్లెక్సిబిలిటీ.
ఒక రోజులో ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయగలగడం, అమ్ముకోగలగడంతో పాటు డెలివరీ విషయంలో ఉండే సౌలభ్యం కారణంగా, భవిష్యత్తు కోసం బంగారాన్ని దాచుకోవాలని అనుకునేవారికి డిజిటల్ గోల్డ్ (digital gold) గొప్ప ఎంపిక అవుతుంది.
డిజిటల్ గోల్డ్ (digital gold) ను కొనేందుకు ఎన్నో సులభమైన మార్గాలున్నాయి. అందులో ఒకటి Jar App. ఇది బంగారంపై మీరు సులభంగా పెట్టుబడి పెట్టేందుకు మీకు అవకాశమిస్తుంది.
ప్రతీరోజు మీరు చేసే లావాదేవీల్లో పొదుపు చేసి మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో Jar యాప్ మీకు సహాయపడుతుంది.
మీ దగ్గర మిగిలిన చిల్లరను Jar app ఆటోమేటిక్‌గా డిజిటల్ గోల్డ్ (digital gold) రూపంలో పెట్టుబడి పెడుతుంది. తద్వారా భవిష్యత్తులో మీకు ఉపయోగపడేలా డిజిటల్ గోల్డ్ (digital gold) ను సమీకరిస్తుంది.