Buy Gold
Sell Gold
Daily Savings
Digital Gold
Instant Loan
Round-Off
Nek Jewellery
పొదుపు చేయడం ఇప్పుడు సులభతరమైంది! జార్ (Jar) యాప్‌తో ప్రతిరోజూ పొదుపు చేయడం ప్రారంభించండి. అంతేగాక, ప్రతిరోజూ మీరు పొదుపు చేసుకున్నదానిని రెట్టింపు చేసుకునే అవకాశం పొందండి!
జార్ (Jar) అనేది మీరు ఆన్లైన్లో డబ్బులు ఖర్చు చేసిన ప్రతీసారి చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేస్తూ డబ్బు పొదుపును మీకు ఒక సరదా అలవాటుగా మార్చే రోజువారీ గోల్డ్ సేవింగ్స్ యాప్.
జార్ (Jar) యాప్ ఒక డిజిటల్ పిగ్గీ బ్యాంక్ లాంటిది. ఇది మీ మొబైల్ ఫోన్లోని ఎస్ఎంఎస్ ఫోల్డర్ నుండి మీరు ఏం ఖర్చులు చేస్తున్నారనే దానిని గుర్తిస్తుంది. మీ ప్రతీ ఖర్చుకు ఎంతో కొంత చిల్లరను మిగిల్చేందుకు మీ ఖర్చును దానికి సమీపంలోని 10కి రౌండ్ ఆఫ్ చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఆన్లైన్లో 98 రూపాయలకు మొబైల్ రీఛార్జ్ చేసినట్లయితే, జార్ (Jar) యాప్ మీ ఎస్ఎంఎస్ ఫోల్డర్‌లోని రీఛార్జ్ నిర్ధారణ సందేశాన్ని గుర్తించి, దానిని సమీపంలోని 10కి అంటే 100 రూపాయలకు రౌండ్ ఆఫ్ చేస్తుంది. అప్పుడు ఎక్కువగా ఉన్న ఆ 2 రూపాయల (100-98) చిల్లరను మీ బ్యాంక్ ఖాతా నుండి తీసుకుంటుంది (మీ యూపీఐ ఐడీకి జోడించబడిన బ్యాంక్ ఖాతా). ఆ చిల్లరను ఆటోమేటిక్‌గా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతుంది.
మీ ఆ చిల్లరను జార్ యాప్ 99.9% స్వచ్ఛమైన బంగారంలో ఆటోమేటిక్‌గా పెట్టుబడి పెడుతుంది. ఆ బంగారం ప్రపంచ స్థాయి వాల్ట్‌లలో పూర్తిగా భద్రంగా ఉంటుంది. అంతేగాక, భారతదేశంలోని టాప్ బ్యాంకులచే బీమా చేయబడి ఉంటుంది.
లక్షలాది మంది భారతీయులు పొదుపు, పెట్టుబడిని ఆటోమేటిక్‌గా చేసేసుకోవడానికి యూపీఐ ఆటోపే సౌలభ్యాన్ని ఉపయోగించే భారతదేశంలోనే మొట్టమొదటి, ఏకైక యాప్ జార్ (Jar). భారతదేశంలోని జనాభాకు మైక్రో-సేవింగ్స్, ప్రజాస్వామ్యబద్ధమైన పెట్టుబడులలో సాయం చేసేందుకు జార్ (Jar) యాప్ ఎన్పీసీఐ (NPCI), ప్రధాన యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల ఆశీస్సులతో, పూర్తిగా ఆటోమేటెడ్ సొల్యూషన్స్‌తో మన ముందుకు వచ్చింది.
● మీరు కేవలం 45 సెకన్లలోనే జార్ (Jar) యాప్ అకౌంట్‌ను రూపొందించుకోవచ్చు. ఇది పేపర్‌లెస్ ప్రక్రియ. అంతేగాక, జార్ (Jar) యాప్‌లో పొదుపు చేయడం ప్రారంభించడానికి కేవైసీ అవసరం కూడా లేదు.
● మీరు ఎప్పుడైనా మీ బంగారాన్ని విక్రయించవచ్చు. మీ ఇంటి నుండే మీ బ్యాంక్ అకౌంట్‌కు మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. పైగా, ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ లేదు.
● దీనిలో మీరు గేమ్‌లను ఆడటంతో పాటు మీ సేవింగ్స్‌ను ఉచితంగా రెట్టింపు చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు.
● జార్ (Jar) యాప్ మీ సేవింగ్స్‌ను ఆటోమేట్ చేస్తుంది. తద్వారా ప్రతీరోజు క్రమశిక్షణతో పొదుపు చేసేలా మీకు సహకరిస్తుంది.
● సెబీ (SEBI) గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా ఉన్న ఏ భారతీయ పౌరుడైనా జార్ (Jar) తో పెట్టుబడి పెట్టవచ్చు.
● భౌతిక బంగారంలా కాకుండా, మీరు దొంగతనం గురించో లేదా ఖరీదైన లాకర్ ఫీజుల గురించో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ బంగారం బ్యాంక్-గ్రేడ్ ప్రపంచ స్థాయి లాకర్లలో ఉచితంగా నిల్వ చేయబడుతుంది.
జార్ (Jar) యాప్ పురాతన పిగ్మీ డిపాజిట్ స్కీమ్‌ను కూడా డిజిటలైజ్ చేసింది, ఇది బ్యాంకు ఖాతా ఉన్న ప్రతీ భారతీయుడు ప్రతీరోజు రూ. 1 నుంచి మొదలుకొని నిర్దిష్ట మొత్తాన్ని ఆదా చేసేలా, దాన్న ఆటోమేటిక్‌గా బంగారంలో పెట్టుబడి పెట్టేలా అనుమతిస్తుంది.