Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
డబ్బు దాచుకుందామని అనుకున్నా కుదరట్లేదా? ఇది మనందరికీ జరిగేదే, కానీ బాధపడకండి. ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ఈ 7 ప్రభావవంతమైన మనీ చాలెంజ్‌లను చూడండి.
పొదుపు విషయానికొస్తే మనలో చాలామంది దాన్ని సరదాగా చూడరు. కానీ చాలాసార్లు అది కాదు.
ఎందుకంటే మీరు ఇష్టపడే వస్తువులను కోల్పోయినప్పుడు లేదా సంపదను కూడబెట్టుకోవడానికి బడ్జెట్ విషయంలో కఠినంగా ఉండాల్సి వచ్చినప్పుడు మాత్రమే డబ్బును ఆదా చేయడం సాధ్యమవుతుందని మన మనసు చెబుతుంది.
మీరు మ్యూచువల్ ఫండ్స్, సిప్ లేదా ఎల్ఐసీ పాలసీల వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి డబ్బును ఆదా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది.
కానీ, ప్రస్తుత కాలంలో యువత దీర్ఘకాలిక కమిట్మెంట్లతో పాటు వేగంగా సేవింగ్స్ చేసుకోవాలని కోరుకుంటోంది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఐఫోన్ 13ను కొనుక్కొనేందుకు వీటిని ఉపయోగించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
కాబట్టి, మీ మొత్తం పొదుపును అలాగే ఉంచుకునేందుకు చిట్కాల కోసం చూస్తున్నట్లయితే.. ఈ 7 మనీ చాలెంజ్‌లను తీసుకొని మీ సేవింగ్స్‌లో పెద్ద మార్పులు తెచ్చుకోండి:
ప్రతీ తల్లి, తండ్రి నుంచి ఒక బంగారం లాంటి సలహా, షాపింగ్ చేస్తున్నట్టు వచ్చిన కల - మీ డబ్బును వృథా చేసుకోకండి! మీరు ఒక 3 నెలల పాటు డబ్బును ఆదా చేసే చాలెంజ్‌ను పూర్తి చేయగలిగితే ఇక మీరు నిజమైన సేవింగ్స్‌తో రివార్డు పొందుతారు.
రోజులు బాగా లేవు. కాబట్టి ఇకపై వృథాగా కొనేందుకు మీ జాబితాలో వేటినీ చేర్చకండి. అయితే అద్దె చెల్లించడం, ఇంధనం, బిల్లులు చెల్లించడం, కిరాణా సామగ్రి కొనడం వంటి సాధారణ ఖర్చులు ఎలాగూ తప్పవు.
కానీ, ఈ చాలెంజ్ సమయంలో బయట తినడం, స్విగ్గీలో ఆర్డర్ చేయడం, ఉదయాన్నే స్టార్‌బక్స్‌కు వెళ్లడం, ఉద్రేకపరిచే షాపింగ్ వంటివి మాత్రం చేయకండి.
ఈ మూడు నెలల చాలెంజ్‌ను జాగ్రత్తగా పూర్తి చేసినట్లయితే అది మీ అనవసరమైన ఖర్చులను తగ్గించడమే కాకుండా 3 నెలలు పూర్తయ్యే నాటికి రివార్డులు పొందడంలో మీకు సాయపడుతుంది.
మమ్మల్ని నమ్మటం లేదా? అయితే బడ్జెట్ ట్రాకర్‌ను ఉపయోగించండి. అవసరం లేని ఖర్చులను తగ్గించినప్పుడు 90 రోజుల్లో మీరు ఆదా చేసిన డబ్బు మొత్తాన్ని ట్రాక్ చేసుకోండి!
వారం మొత్తం చాలా కష్టంగా గడిచిందనుకోండి. స్నేహితులతో కలిసి డ్రింక్ కోసం లేదా భాగస్వామితో కలిసి వారాంతపు విహారయాత్రకు వెళ్లాలనిపిస్తుంది కదూ. చాాలా ఆనందంగా అనిపిస్తుంది కదా?
ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి. కానీ ఇలా చేస్తే మీ జేబులు ఖాళీ కావడం ఖాయం.
మీ పర్సుపై భారం పడకుండా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం అనేది అదనపు ఖర్చులను తగ్గించుకోవడానికి ఒక తెలివైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు.
మీ నగరంలోనే అలా అలా తిరిగి రావడం, మీ భాగస్వామితో కలిసి కాలక్షేపం చేస్తూ నడవడం లేదా మీ క్రెడిట్ కార్డ్‌ను ఎలాపడితే అలా వాడకుండా వారాంతాల్లో ఏదైనా షోలకు వెళ్లడం వంటివి చేయొచ్చు.
మీ ఇంటిలో ఎక్కువ లోడ్ పడే వస్తువులను గుర్తించడం ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు. అదే సమయంలో మీ కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు.
ఫోన్ చార్జర్లు, ల్యాప్‌టాప్ కార్డులు, కాఫీ మెషీన్లతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువ విద్యుత్‌ను వాడుతుంటాయి.
ఉపయోగంలో లేనప్పుడు విద్యుత్, డబ్బు ఆదా చేయడానికి ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను ప్లగ్‌ల నుంచి తీసేయండి.
మీరు స్మార్ట్ పవర్ కేబుళ్లు, మీ డెస్క్‌టాప్ కంప్యూటర్లో స్లీప్ మోడ్ వంటి మీ పరికరాల విద్యుత్‌ను ఆదా చేసే సెట్టింగ్స్ వాడితే మీ విద్యుత్ బిల్లు 20 శాతం మేర తగ్గుతుంది.
ఇది నిజంగా పని చేస్తుందని మీకు అనిపించకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మీ ఏడాది విద్యుత్ బిల్లులను మాత్రం తగ్గిస్తుంది. ఇప్పుడు చెప్పండి.. మీ డబ్బును అనవసరమైన ఖర్చు నుంచి ఆదా చేయట్లేదా?
మీరు బయటికి వెళ్లినప్పుడల్లా మీ లెక్కలు సరి చూసుకోవాలి. మీ అవసరాలకు తగ్గట్టు ఏదైనా బడ్జెట్ టూల్ లేదా ఏదైనా సాఫ్ట్వేర్ ద్వారా మీ రోజువారీ ఖర్చులను ట్రాక్ చేయవచ్చు.
ఇలా మీరు ఎక్కడ డబ్బు ఆదా చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు.
మీ డబ్బు ఎలా, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోకపోతే ఆదా చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. మీ రోజువారీ ఖర్చులను చూసుకోకపోవడం వల్ల డబ్బుపై ఆందోళన పెరుగుతుంది.
మీ రోజువారీ సేవింగ్స్ స్కీం ద్వారా మీ ఆందోళనను ఆపగలిగే స్మార్ట్ మార్గాల్లో ఇది ఒకటి.
జార్ వంటి యాప్‌లు మీ రోజువారీ ఖర్చులను సరిచూసి, 100 శాతం డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతాయి. అంటే ఇది ఒకేసారి ఖర్చు చేయడం, పొదుపు చేయడం కన్నా ఎక్కువ అని చెప్పుకోవచ్చు.
నైకా సేల్‌లో అన్ని సౌందర్య ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపు ఉంటుంది. పీఎస్5 (PS5) మొత్తానికి అమెజాన్ స్టాక్‌లో ఉంది.
వీటిలో ఏదైనా ఆలోచన వస్తే మీ చేయి వణికిపోయి స్మార్ట్‌ఫోన్‌ను పట్టుకుంటారా? భవిష్యత్తులో మీరు అలాంటి ఉత్తేజాన్ని ఇచ్చే కొనుగోళ్లను నివారించుకునేందుకు ఓ మార్గం ఉంది.
30 రోజుల పాటు నో షాప్ రూల్ పాటించండి. ఈ 30 రోజుల రూల్ మిమ్మల్ని హఠాత్తుగా ఏదీ కొనకుండా ఆపగలదు. అలాగే మీ అవసరాలకు, అత్యవసరాలకు మధ్య తేడాను గుర్తించి డబ్బును ఆదా చేసుకోవడంలోనూ ఉపయోగపడుతుంది.
షాపింగ్, జొమాటో, ఫ్యాన్సీ డిన్నర్ల వంటి ఖర్చులకు దూరంగా ఉండటమే మీరు చేయాల్సింది.
దీని ద్వారా రెండు ప్రయోజనాలు ఉన్నాయి - మీకు అస్సలు అవసరం లేని వస్తువుల ఖర్చును మీరు పరిమితం చేస్తారు. ఎంచక్కా మీరు రూపొందించుకున్న బడ్జెట్‌ను మీరు పాటించవచ్చు.
ఇది తప్ప ప్రశంసించదగిన వేరే వాటిని రద్దు చేయాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్‌పై భారం వేసే అపరిమిత వినోదం, సంగీత చానెళ్ల సబ్స్క్రిప్షన్లను ఓసారి చూసుకోండి.
ప్రస్తుతానికి అనవసరమైన వాటిని నిలిపివేసుకోండి, ముఖ్యంగా ఇంటర్నెట్లో ట్రెండింగ్‌లో ఉన్న చానెళ్లలో సిరీస్ చూసేందుకు ఆరు నెలల కింద చెల్లించిన సభ్యత్వాలను ఆపేసుకోండి.
మీ జీతం నుంచి కరిగిపోయే మీ నెలవారీ సబ్స్క్రిప్షన్లను నిశితంగా పరిశీలించండి. ఇకపై మీకు ప్రయోజనం ఇవ్వని వాటిని తీసేయండి.
ఇలా చేయడం వల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బును విలువైన సేవల కోసం ప్రతీ నెలా తక్కువ మొత్తంలో మాత్రమే ఖర్చు చేయడంలో మీకు సహాయపడుతుంది.
అధిక ఖర్చులు, పొదుపు లేకపోవడం గురించి ఫిర్యాదు చేసినప్పుడు మన తల్లిదండ్రులు ఎప్పుడూ ఇచ్చే మంచి సలహా ఇది!
ఇంట్లో క్రమం తప్పకుండా వంట చేయడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది. సులువైన రోజువారీ పొదుపు పథకాల్లో ఇది కూడా ఒకటి.
మీకు అవకాశం దొరికినప్పుడల్లా ఆహారాన్ని లొట్టలు వేసుకుని తినే ఆహార ప్రియులైతే, ఇది మీ కోసమే!
మీరు ఎప్పుడూ బయట తినడం అలవాటుగా ఉంటే మాత్రం మొదట్లో ఇంట్లో వండిన భోజనాన్ని మాత్రమే తినేందుకు పరిమితం కావాలంటే కాస్త కష్టంగా ఉండొచ్చు. కానీ మీరు దాన్ని అలవాటు చేసుకున్నాక దీన్ని ఖచ్చితంగా సాధించవచ్చు.
ఈ విధంగా మీరు విందులు, అర్ధరాత్రి పూట పార్టీల కోసం చేసే వేల రూపాయల ఖర్చును ఆదా చేసుకోవడమే కాకుండా ఆరోగ్యంగా తినడం, మీ శరీరానికి మంచి చేయడం కూడా!
ఈ చిట్కాలతో మీ డబ్బును తెలివిగా ఆదా చేసుకోగలగడమే కాకుండా మెరుగైన దీర్ఘకాలిక మార్పులు జరిగేలా చూసుకోవచ్చు.
మీరు స్మార్ట్‌గా పొదుపు చేసుకునేందుకు మీ ఖర్చులను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడే డైలీ సేవింగ్స్ యాప్‌ను ఉపయోగించండి. ఇకపై మీరు బయటికి వెళ్లినప్పుడు సరైన ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది మీకు సాయం చేస్తుంది.