Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా? వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదా? ఈ కింద పేర్కొన్న పరిష్కార మార్గాలను చదివి.. రుణ విముక్తులు అవండి.
ఈ డెట్ ట్రాప్ (అప్పుల ఉచ్చు) ఎలా ఉంటుందో ఈ ఒక్క చిన్న ఉదాహరణతో ప్రారంభిద్దాం. మీ నెలవారీ ఆదాయం రూ. 10,000 ఉందని, అది మీ అవసరాలను తీర్చడానికి సరిపోవట్లేదని అనుకుందాం.
మీరు విలువైన వాచ్ లేదా ఖరీదైన ఐఫోన్ కొనాలని అనుకుంటున్నపుడు మీరు లోన్ సాయం తీసుకుంటారు.
మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారని అనుకుందాం. దాని ఈఎంఐ (EMI) నెలకు రూ. 5,000. మీ నెలవారీ ఆదాయం కేవలం రూ. 10,000 మాత్రమే. అందులో సగం అమౌంట్ అంటే రూ. 5,000 లను మీరు ఈఎంఐ (EMI) చెల్లిస్తున్నారు. కావున మిగిలిన డబ్బులతో మీ నెలవారీ ఖర్చులు వెళ్లదీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇతర రుణాలు ఏవీ తీసుకోకుండా ఉండాలి.
లోన్లను సకాలంలో చెల్లించలేకపోతే మీరు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు మీరు అప్పుల చట్రంలో చిక్కుకుపోతారు.
మీరు పాత రుణాలను చెల్లించడంలో విఫలమవుతూ.. కొత్త రుణాలను తీసుకుంటూ ఉంటే మీరు ఒక విధంగా ఊబిలో కూరుకుకుపోతారు. దీనినే డెట్ ట్రాప్ (అప్పుల ఉచ్చు) అని పిలుస్తారు.
పొదుపు, పెట్టుబడుల కోసం వ్యూహాలను కలిగి ఉన్నట్లే ఆర్థికంగా బలంగా ఉండేందుకు డెట్ స్ట్రాటజీ (అప్పుల వ్యూహం) కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం.
మంచి డెట్ స్ట్రాటజీని కలిగి ఉండటం వలన మీరు రుణాలను మేనేజ్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. మీరు మంచి, ఆర్థికంగా పరిపుష్టమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది.
అయితే, మీరు అప్పుల ఉచ్చులో చిక్కుకుంటామని చింతించాల్సిన అవసరం లేదు. కానీ దానికంటే ముందు అసలు డెట్ ట్రాప్ (అప్పుల ఉచ్చు) అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి.
మీరు పాత అప్పులను చెల్లించేందుకు ఎక్కువగా కొత్త రుణాలను తీసుకుంటూ ఉంటే మీరు డెట్ ట్రాప్ (అప్పుల ఉచ్చు) లో చిక్కుకుపోతారు.
మీ స్థోమతకు మించిన అప్పులు పెరిగిపోవడం వలన మీరు వాటిని సకాలంలో చెల్లించలేరు. అప్పుడు మీరు డెట్ ట్రాప్ (అప్పుల ఉచ్చు) లో పడిపోయే ప్రమాదం ఉంటుంది.
మనం డెట్ ట్రాప్ (అప్పుల ఉచ్చు) లో ఉన్నామా లేదా అని ఎలా గుర్తించగలం? డెట్ ట్రాప్ (అప్పుల ఉచ్చు)ను గుర్తించేందుకు రెండు మార్గాలున్నాయి.
1. ఈఎంఐ (EMI)-జీతం నిష్పత్తి: దీని కోసం ఒక చిన్న ఉదాహరణను చూద్దాం. మీ ఈఎంఐ (EMI) రూ. 10,000 ఉంది. మీకు చేతికొచ్చే నెలవారీ జీతం రూ. 20,000 ఉందని అనుకుందాం. అప్పుడు మీరు చెల్లించాల్సిన ఈఎంఐ (EMI) నిష్పత్తి 0.5 శాతం. అనేకమంది ఆర్థిక నిపుణులు సూచించే దాని ప్రకారం ఈ నిష్పత్తి 0.3 శాతం మాత్రమే ఉండాలి.
2. రుణం-ఆస్తి నిష్పత్తి: మీ రుణ (లోన్) బ్యాలెన్స్ రూ. 25 లక్షలు అనుకుందాం. మీరు రూ. 10 లక్షల రుణం తీసుకుంటే మీ రుణం- ఆస్తుల నిష్పత్తి 2.5 గా ఉంటుంది. కానీ ఈ నిష్పత్తి 0.5 దాటకూడదని చాలా మంది ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇటువంటి సందర్భాల్లో మీరు మీ ఆస్తుల విలువను పెంచుకునేందుకు, మీ ఆదాయ మార్గాలను పెంపొందించుకునేందుకు లేదా మీ రుణ మొత్తాలను తగ్గించుకునేందుకు కృషి చేయాలి. లేకుంటే మీరు డెట్ ట్రాప్ (అప్పుల ఉచ్చు)లో చిక్కుకుపోతారు.
ప్రైవేటు వడ్డీ వ్యాపారి నుంచి మీరు అప్పు తీసుకున్నప్పుడు రెండు విషయాలను గమనించాలి. మొదటిది: మీరు తీసుకునే అసలు రుణ మొత్తం, రెండోది: వడ్డీ (మీరు తీసుకున్న అసలు రుణం మీద బ్యాంక్ వేసే చార్జీ).
మీ అసలు మొత్తం తగ్గడం ప్రారంభించినప్పుడు మీరు రీయింబర్స్మెంట్ (మీరు చెల్లించిన డబ్బును తిరిగి చెల్లించడం) చేయడంలో ప్రాధాన్యాన్ని పొందవచ్చు. కానీ ఇక్కడ ఓ చిక్కు ఉంది.
మీరు మీ రుణాన్ని రీయింబర్స్ చేసిన ప్రతీసారి మీరు అసలు మొత్తం, దాని మీది వడ్డీకి కిస్తీలు కట్టాల్సి వస్తుంది.
చాలా రుణాలు అమౌర్టైజేషన్ (అసలు మొత్తంతో పాటు వడ్డీ కూడా చెల్లించినట్లైతే) విధానాలు కలిగి ఉండటం వలన ఇలా జరుగుతుంది.
మీ రుణం నిర్దిష్ట వాయిదాల్లో చెల్లించబడుతుంది. ప్రతీ కిస్తీలో అసలు మొత్తం, వడ్డీని మీరు చెల్లించాల్సి వస్తుంది.
మీరు కిస్తీలు చెల్లించలేని సందర్భంలో మీరు మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఎలాగంటే..
అసలు మొత్తం తగ్గకపోగా, వడ్డీ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. అటువంటి సమయంలో మీ రుణం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా కష్టమవుతుంది.
మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడానికి ఇవే కారణాలు. వీటిల్లో ఏవైనా కారణాలు చదివినప్పుడు అచ్చంగా మీరు చేస్తున్నట్లే ఉంటే.. వెంటనే ఖర్చులను మరోసారి తనిఖీ చేసుకోండి.
● మీరు మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు అధిగమిస్తే..
● మీ నిర్దిష్ట ఖర్చులు మీ మొత్తం ఆదాయంలో 70శాతం కంటే ఎక్కువగా ఉంటే..
● ఇలా జరిగినప్పుడు మీరు పొదుపు కోసం డబ్బులను పక్కన పెట్టలేరు.
● మీకు చాలా రుణాలు ఉంటే..
● మీ ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐలు తీర్చేందుకే చెల్లిస్తుంటే..
● మీరు రుణం కోసం చేసిన దరఖాస్తు తిరస్కరణకు గురైతే..
1. మీ క్రెడిట్ కార్డు పరిమితిని అధిగమిస్తే: క్రెడిట్ కార్డుతో వస్తువులను కొనుగోలు చేయడం చాలా సులభం. కొనుగోలు ప్రక్రియ ఎంతో తొందరగా ముగుస్తుంది. క్రెడిట్ కార్డు ఉంటే కొనుగోళ్ల గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. ఇలా దేనికి పడితే దానికి మీ క్రెడిట్ కార్డును వాడుకుంటూ పోతే ఆ కార్డు పరిమితి దాటిపోతుంది. క్రెడిట్ కార్డు పరిమితి దాటిపోతే మీరు దాని గురించి ఆలోచించాలి. మీరు ఆర్థికంగా బలంగా లేరని అర్థం చేసుకోవాలి. మీ ఫైనాన్స్‌ను గురించి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే మీరు అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి.
2. ఈఎంఐలు మీ ఆదాయంలో 50శాతం మించిపోయినప్పుడు: ప్రస్తుత రోజుల్లో రుణాలు, ఫైనాన్స్‌లు చాలా సులభంగా లభిస్తున్నాయి. కావున ప్రజలు రుణాలు తీసుకునేందుకు ఈజీగా ఆకర్షితులు అవుతున్నారు. అంతేకాకుండా ప్రతీ వస్తువుకు భారీ తగ్గింపులు, ఎక్కువ డిస్కౌంట్లు లభిస్తుండటం వలన కొనేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈఎంఐ సౌలభ్యం కూడా అందుబాటులో ఉండటంతో కొనుగోళ్ల సంఖ్యను పెంచుతున్నారు. ప్రతి నెలా ఈఎంఐలు కట్టేటప్పుడు ఎక్కువగా అనిపించకపోయినా కానీ వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు నెలవారీగా చెల్లించే ఈఎంఐల మొత్తం మీ నెలవారీ ఆదాయంలో 50శాతానికి మించకుండా ఉండాలి. మీ ఈఎంఐల విలువ 50 శాతానికి మించి పోతే మీరు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారని వెంటనే అర్థం చేసుకోవాలి.
3. మీ నెలవారీ స్థిర ఖర్చులు ఆదాయంలో 70 శాతం దాటితే: ఈఎంఐలు ప్రధాన ఆర్థిక అవసరాలు కాదు. మీకు ఇదే కాక వేరే ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. నెలవారీగా వీటిని తప్పకుండా చెల్లించాలి. స్కూల్ ఫీజులు, గ్యాస్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, అద్దె మొదలయినవి. మీ స్థిర ఖర్చులు మీ నెలవారీ ఆదాయంలో 50 శాతానికి మించకుండా ఉండాలి. మీ నెలవారీ ఖర్చులు మీ ఆదాయంలో 70 శాతం దాటిపోతే అది మీకు ప్రమాదకరమైన జోన్‌గా గుర్తుండాలి. మీరు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారనడానికి ఇది సంకేతం. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఆదాయంలో దాదాపు 30శాతం మొత్తాన్ని ఎక్కడైనా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
4. చాలా సంఖ్యలో రుణాలు ఉంటే: మీకు చాలా సంఖ్యలో రుణాలు ఉండి.. వాటి రీపేమెంట్‌ను నెలలో వివిధ తేదీల్లో కట్టాల్సి వస్తే.. అది సరైన పద్ధతి కాదు. మీరు ప్రతి సారి గుర్తుంచుకొని చెల్లించడం కుదరకపోవచ్చు. మీరు డీఫాల్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అంతే కాకుండా ఈ రుణాల ద్వారా మీరు ఎక్కువ మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
5. డబ్బులను పొదుపు చేయలేరు: మీరు ప్రతి నెల ఎంతో కొంత డబ్బును పొదుపు చేయకపోవడానికి ప్రధాన కారణం.. మీకు అత్యధికంగా ఉన్న రుణాలు. ఖర్చులు, ప్రతి సారి ఉండే ఖర్చుల మధ్య బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. లేకపోతే మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. మీరు ప్రతి నెలా డబ్బులను పొదుపు చేయకపోతే డెట్ ట్రాప్‌లోకి పడిపోతున్నారని తెలుసుకోవాలి.
6. మీ లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది: మీ లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురయితే.. అది మీకు ఒక ప్రమాద హెచ్చరిక. మీరు ఎందుకు అప్పుల ఊబిలో కూరుకుపోయారో.. అందులో నుంచి ఎలా బయటకు రావాలో ఆలోచించుకోవాలి. సాధ్యమైనంత త్వరగా అప్పుల ఊబిలో నుంచి బయటపడాలి. ఎప్పుడైనా సరే మీరు లోన్‌కి దరఖాస్తు చేసినప్పుడు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తాయి. ఆ తర్వాతే మీకు రుణాన్ని మంజూరు చేస్తాయి. మీకు ఇది వరకే రుణాలు ఉంటే బ్యాంకులు మీకు కొత్త రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. సిబిల్ స్కోర్ చెక్ చేసినప్పుడు మీకు ప్రస్తుతం ఉన్న రుణాల వివరాలు తెలిసిపోతాయి. మీకు కొత్త రుణాన్ని తీర్చే స్థోమత లేకపోతే రుణాల అప్లికేషన్లను బ్యాంకులు తిరస్కరిస్తాయి. ఒకవేళ మీకు రుణాలు మంజూరైనా కానీ అవి అధిక వడ్డీతో మంజూరవుతాయి. వాటి వలన మీరు నెమ్మదిగా అప్పుల ఊబిలోకి నెట్టబడతారు.
1. మీకు ఉన్న సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి: కింది విధానాలు మీరు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నప్పుడు మీకు సహాయం చేస్తాయి.
మెరుగుపరిచేందుకు మీరు ఏం చేయవచ్చు?
● రుణాల సమస్య ఉందని మీరు ముందుగా మీ సమస్యను అంగీకరించాలి.
● మీరు డెట్ ట్రాప్ (అప్పుల ఉచ్చు)లోకి పడిపోవడానికి ఎటువంటి కారణాలు ప్రధానంగా ప్రభావం చూపాయో ముందుగా గుర్తించాలి.
● ఇటువంటి కారణాలను తగ్గించుకునేందుకు ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలి.
● బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోండి. మీ ఖర్చులు, అవసరాలపై ఓ కన్నేసి ఉంచండి.
2. మీ అవసరాలకు తగ్గట్లు బడ్జెట్‌ను రూపొందించండి: మీరు మీ బడ్జెట్, అప్పుల పరిస్థితిని సమగ్రంగా విశ్లేషించండి. అప్పుడు అత్యంత ముఖ్యమైనవి, ముఖ్యం కానివి, అనవసరమైన వాటిని గుర్తించేందుకు వీలుంటుంది.
● ప్రాధాన్యత జాబితాను రూపొందించుకోండి.
● తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది.
● మీరు ఆర్థికంగా మళ్లీ పటిష్టంగా మారే వరకు అనవసరమైన, పాక్షికంగా అవసరమైన జాబితాలో ఉన్న వస్తువుల కోసం ఖర్చులను పరిమితం చేయాలి.
3. మీరు డెట్ కన్సాలిడేషన్ లోన్ ఎంచుకోవచ్చు: మీరు నెలలో వివిధ తేదీల్లో వేర్వేరు రుణాల కోసం చెల్లింపులను చేస్తే.. మర్చిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో మీరు డెట్ కన్సాలిడేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. తక్కువ వడ్డీతో డెట్ కన్సాలిడేషన్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా మంచిది. మీకు ఒకసారి ఈ లోన్ వచ్చిన తర్వాత మీరు నెలలో కేవలం ఒకసారి మాత్రమే రుణ చెల్లింపు చేస్తే సరిపోతుంది.
ఇది మీకు ఏం సాయం చేస్తుందంటే:
● వడ్డీపై డబ్బును ఆదా చేసుకోవడానికి.
● సరైన సమయానికి ఈఎంఐలు చెల్లించడానికి.
● రుణం వేగంగా చెల్లించడానికి.
● మీ ఆర్థిక శక్తిని తిరిగి పొందడానికి.
4. చెల్లింపులను ఆటోమేట్ చేయడం: రుణాన్ని తీసుకున్నాక సమయానికి తిరిగి ఈఎంఐలను సరిగా చెల్లించడం మీ బాధ్యత. మీరు ఆర్థిక నిబద్ధతను కలిగి ఉన్నారని ఇది సూచిస్తుంది. సమయానికి చెల్లింపు చేసేందుకు మీరు మీ పేమెంట్లను ఆటోమేట్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే సమయానికి చెల్లింపులు పూర్తవుతాయి. చెల్లింపులను ఆటోమేట్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..
● చెల్లింపులను రెగ్యులర్‌గా పూర్తి చేస్తుంది.
● మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.
● సకాలంలో చెల్లింపులు చేయడం వలన మీకు పెనాల్టీలు, లేట్ ఫీజులు అనే చింత ఉండదు.
5. ఎక్కువ అప్పులు తీసుకోవడం మానేయండి: మీరు ఇప్పటికే పరిమితి వరకు అప్పులు తీసుకుంటే ఇంకా కొత్త అప్పులను తీసుకోవడం మానేయాలి. కేవలం 40 శాతం మాత్రమే అప్పు తీసుకునేలా నిబంధన పెట్టుకోవాలి. ఈ నిబంధనను కనుక మీరు పాటించకపోతే అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలా చేస్తే మీరు అనేక ఆర్థిక విపత్తుల నుంచి కాపాడగలుగుతారు.
6. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను వెతకండి: ప్రస్తుతం మీకు ఉన్న అప్పుల నుంచి బయటపడేందుకు ఉన్న ఏకైక మార్గం.. మరింత ఆదాయాన్ని పొందడం. మీ ఆదాయాన్ని పెంపొందించుకున్నప్పుడు మీకు మరింత ఆర్థిక భద్రత ఉంటుంది. అప్పుడు మీరు తీసుకున్న అప్పును ఈజీగా, తొందరగా తిరిగి చెల్లిస్తారు. ఇందుకోసం మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. లేదా మీ నైపుణ్యాలకు సరిపోయే మరో ఉద్యోగాన్ని ఎంచుకోవచ్చు.
7. ఖర్చుతో కూడుకున్న రుణాలను వెంటనే చెల్లించండి: మీరు డెట్ కన్సాలిడేషన్ లోన్ తీసుకోవడాన్ని ఇష్టపడకపోతే.. మీకు ఉన్న రుణాలను వేర్వేరుగా చెల్లించేందుకు ఇబ్బందులు పడతారు. (ఒకసారి ఒకే రుణాన్ని తీసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి) మీకు ఉన్న లోన్లలో ఏది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదో ముందుగా దానిని గుర్తించి చెల్లించండి.)
8. మీ క్రెడిట్ స్కోర్‌ను తరుచుగా తనిఖీ చేస్తూ ఉండండి: ఉత్తమ రుణ గ్రహీత యొక్క లక్షణం ఏమిటంటే మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండటం. మీ క్రెడిట్ స్కోర్ 750 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే చాలా మంచిది. చాలా మంది రుణదాతలు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తుల కోసమే చూస్తారు. మీరు మంచి వడ్డీ రేట్లకు రుణాలను పొందుతారు. మీకు మంచి ఆర్థికపరమైన భవిష్యత్తు ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్‌పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచండి. మీరు ప్రతీ మూడు నెలలకోసారి క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేస్తూ ఉండండి. అన్ని విభాగాలు సరిగ్గా ఉన్నాయో లేదో మీరు చూసుకోవాలి.
9. నిపుణుల సాయం తీసుకోండి: కొన్ని సార్లు అప్పుల ఊబి నుంచి బయటపడటం మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకోగలం. కానీ ఈ విషయంలో ఏ మాత్రం చింతించకండి. ఆర్థిక నిపుణుల సాయం తీసుకోండి. మీకు ప్రక్రియ చాలా సులభం అవుతుంది. మీరు ఎప్పుడైనా ఆర్థికంగా నష్టపోయినట్లు అనిపిస్తే వెంటనే ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. ఆర్థిక నిపుణులు మీకు బడ్జెట్ విషయంలో, ఖర్చుల విషయంలో సహాయం చేస్తారు. ఖర్చులు ఎక్కువ కాకుండా సాయం చేస్తారు. లోన్ ఇచ్చే వారితో చర్చించేందుకు అంగీకరించే కొంత మంది ఆర్థిక నిపుణులు కూడా ఉన్నారు. వారు మీ కోసం రుణాల నిబంధనలను సులభతరం చేస్తారు.
మీరు ఆర్థికంగా నిశ్చింతగా ఉండటం కోసం మేము మీకు సాయం చేస్తాం. మీరు కనుక అధిక వడ్డీలు చెల్లించాల్సిన రుణాలను, భారీ మొత్తంలో క్రెడిట్ కార్డు అవుట్స్టాండింగ్లను కలిగి ఉంటే మీరు నెమ్మదిగా అప్పుల ఉచ్చులో చిక్కుకుంటున్నారని అర్థం చేసుకోవాలి.
ఒక వంటకం కోసం ఎక్కువ మంది వంటవాళ్లు పని చేస్తే అది పనికి రాకుండా పోతుందనేది పాత సామెత. అచ్చంగా ఈ సామెత లాగే మీకు ఎక్కువగా లోన్లు ఉండటం కూడా మంచిది కాదు. అందుకోసం తక్కువ వడ్డీ రేటుతో ఉన్న కన్సాలిడేషన్ లోన్ తీసుకోవడం చాలా మంచిది. రుణ విముక్తులు కావడానికి ఇది చాలా తెలివైన ఎంపిక.
మీరు పెద్ద మొత్తంలో పర్సనల్ లోన్ తీసుకోవడం వలన మీ అన్ని చిన్న బాకీలు తీరిపోతాయి. ఇక మీరు వాటికి చెల్లించాల్సిన ఈఎంఐల బాధ కూడా తప్పుతుంది. మీరు మీ పర్సనల్ లోన్‌కు సంబంధించిన నెలకు ఒకటే ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది.
డెట్ కన్సాలిడేషన్ లోన్ ఎందుకోసం అర్థవంతంగా ఉంటుంది?
డెట్ కన్సాలిడేషన్ లోన్ అంటే మనకు ఇప్పటికే ఉన్న లోన్లు తీర్చడం కోసం పెద్ద మొత్తంలో మరో లోన్ తీసుకోవడం అన్నమాట.
● డెట్ కన్సాలిడేషన్ లోన్ తీసుకోవడం వలన మీరు మీకు ఉన్న పాత అప్పులను తొందరగా తీర్చేసేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ లోన్లకు తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. మీ నెలవారీ పేమెంట్ల ఖర్చు తగ్గుతుంది.
● ఈ లోన్ మీకు మరింత ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. మీ నెలవారీ ఖర్చులను తగ్గిస్తుంది.
● మీకు ఎక్కువ లోన్లు ఉంటే ప్రతీ నెలా వాటన్నింటికీ ఈఎంఐలు కట్టాలి. కాబట్టి ఒక్కోసారి మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు మీకు ఎక్కువ చార్జీలు పడే అవకాశం ఉంటుంది. ఇలా ఒకటే లోన్‌ను పెద్దమొత్తంలో తీసుకోవడం వలన ఈఎంఐ గురించి మర్చిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. తద్వారా మీరు లేట్ ఫీజులు, అధిక వడ్డీ రేట్ల నుంచి తప్పించుకోవచ్చు.
● ఇలా చేయడం ద్వారా మీరు సులభంగా మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు. భవిష్యత్తులో మీకు లోన్లు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.