Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
పొదుపు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటారా? ఎందుకంటే, మనమంతా ఎమోషనల్ జీవులం, పైగా కొన్నిసార్లు మాత్రమే లాజికల్‌గా ఆలోచిస్తాం. జార్ యాప్ వాడటం వలన పొదుపు చేయడం చాలా సులభం అవుతుంది. ఈ యాప్ ఆటోమేటిగ్గా పొదుపు చేస్తోంది.
మీ వద్ద కంటే బ్యాంకు అకౌంట్లో డబ్బు చాలా సురక్షితంగా ఉంటుందని కొందరు చెబుతారు.
వారు బహుశా సరైన విధానంలో పెట్టబడులు పెట్టడం లేదని గ్రహించండి. కానీ వారి ప్రకటనలో మాత్రం కొంచెం నిజం ఉంది.
ప్రతీ ఒక్కరికి అలవాట్లు ఉంటాయి. అవి మంచివో, చెడ్డవో. (ఈ ఆర్టికల్ చదవడం కంటే ముందుగానే అయిపోయే మీ సిగరెట్ ప్యాకెట్ వంక చూస్తున్నారా?)
కానీ మన ముందు తరాల వారు మనకు నేర్పని ఒక ముఖ్యమైన అలవాటు డబ్బును పొదుపు చేయడం.
పొదుపు అనే పదం పాజిటివ్ అర్థాన్ని కలిగి ఉంటుంది. మనమంతా డబ్బును సరైన పద్ధతిలో పొదుపు చేయాలని కోరుకుంటాం. కానీ ఎక్కడో ఒకచోట విఫలమవుతాం. కొంతమంది మాత్రమే పొదుపు లక్ష్యాన్ని చేరుకుంటారు.
డెలాయిట్ సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో విస్తుగొలిపే విషయాలు బయట పడ్డాయి. భారతీయ యువత తమ ఆదాయంలో 10 శాతం కంటే తక్కువగానే పొదుపు చేస్తున్నారట.
మీరు పదవీ విరమణ చేసినపుడు డబ్బుల గురించి నిశ్చింతగా ఉండాలంటే దశాబ్దాల పాటు మీ ఆదాయంలో 15 శాతం పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ఈ పరిస్థితుల్లో మీకు తప్పకుండా ఏదో ఒక సహాయం అవసరం. ఆ పరిస్థితుల్లోకి మీరు జారుకోకుండా మిమ్మల్ని ఆదుకునేందుకు మేము జార్ యాప్‌ను తీసుకొచ్చాం.
మీరు పొదుపు చేసే డబ్బు బ్యాంకులో ఎలా పెరుగుతుందో మనం ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. ఈ బ్యాంక్ అకౌంట్లో అదనంగా పెరిగిన సొమ్ముతో మీరు అందమైన వస్తువులను కొనుగోలు చేసుకోండి.
మీరు ఖరీదైన బూట్లను కొనడం, ఖరీదైన బూట్లను కొనగల సామర్థ్యాన్ని కలిగి ఉండడంలో గల తేడాను తెలుసుకుంటే మీకు అభినందనలు. ఈ అలవాటును అలవరుచుకోవడం చాలా మంచి విషయం.
అలవాటును అనేక మంది అనేక రకాలుగా నిర్వచిస్తారు. ఏదైనా విషయాన్ని వదులుకోవడం చాలా కష్టంగా ఉంటే అదే అలవాటు.
డబ్బును ఆదా చేయడం కంటే ఖర్చు చేయడం చాలా సులభం. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ప్రకటనల నుంచి వస్తువులను కొనుగోలు చేయడం పొయ్యి మీద పాలు వేడి చేసినంత సులభం.
కానీ మనం పొదుపు అలవాటును ఎలా పెంపొందించుకోవాలి. అనే ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది.
పొదుపును అలవాటు చేసుకోవడానికి సహాయపడే ఒక గొప్ప పుస్తకం.. జేమ్స్ క్లియర్ రాసిన ‘అటామిక్ హ్యాబిట్స్’. ఇది చదివితే పొదుపు చేయడం గురించి మీరు తెలుసుకోవడంతో పాటు అలవాటు చేసుకుంటారు కూడా.
జేమ్స్ చెప్పిన దాని ప్రకారం ఏదైనా కొత్త అలవాటును ఏర్పరుచుకోవడానికి మీరు మీ పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుంది. దాని కోసం మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది.
మీకు పాఠశాలలో ఉన్న ఎక్కువగా చదివే అలవాటును తిరిగి పొందలేకపోతున్నారా?
ఉదయం పూట లేవగానే మీ మంచం మీద ఒక పుస్తకాన్ని ఉంచండి. మీరు రాత్రి పడుకునే ముందు ఆ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది.
పొదుపు అలవాటును పెంపొందించుకోవడానికి మీరు ఈ పద్ధతిని అవలంభిస్తే.. మీరు మీ పరిసరాలను, ప్రవర్తనను పరిశీలించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులు మీకు బెర్ముడా ట్రయాంగిల్లాగా అనిపించవచ్చు.
కెప్టెన్ అమెరికా సినిమా నేపథ్యంలో ఉన్న బాత్రూం డిజైన్ మీకు అవసరం లేదని గ్రహించండి. కానీ డబ్బును ఆదా చేయడం కోసం మీరు మంచి మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది.
మీకు ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వదులుకోవడం నేర్చుకోండి.
తదుపరి చేయాల్సింది ఏమిటంటే.. ఆదా చేయిమని మిమ్మల్ని ప్రోత్సహించే వారిని ఎప్పుడూ పక్కన ఉంచుకోండి.
మీరు ఖర్చు చేసే ప్రతీసారి పొదుపు గురించి మీకు గుర్తుకు రావాలి. మీరు నెలవారీగా ఎంత పొదుపు చేయాలని అనుకుంటారో ఆ డబ్బులను పక్కకు పెట్టాలి.
మీరు బ్యాంకు అకౌంట్లో రెండు ఖాతాలను మెయింటేన్ చేయండి. ఒకటి ఖర్చులకు, రెండోది పొదుపు చేసేందుకు. ప్రతీ నెలా మీకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు ఖాతాలో, మరికొంత మొత్తాన్ని ఖర్చుల ఖాతాలో డిపాజిట్ చేయండి.
ఈ పద్ధతి మీకు అవసరం లేని ఐరన్ మ్యాన్ హెల్మెట్‌ను అధిక ఖర్చు చేసి కొనుగోలు చేద్దామనుకున్నపుడు మిమ్మల్ని ఆపుతుంది. పొదుపులను పెంచడానికి ఈ పద్ధతి చాలా బాగా పనికి వస్తుంది.
నెలవారీగా కుదరకపోతే, కనీసం చిన్న మొత్తాలను పొదుపు చేయడం ప్రారంభించండి. ప్రతీ రోజు రూ. 10 తో మొదలుపెట్టండి. ఈ మొత్తం ప్రస్తుతం తక్కువే అనిపించినా మీరు స్థిరంగా పొదుపు చేస్తే అదే పెరుగుతూ పోతుంది.
తప్పకుండా పొదుపు చేసేందుకు ముఖ్యమైన అలవాటు ఆటోమేటిక్ పొదుపు విధానం. మీ డబ్బును ఆటోమేటిక్‌గా పొదుపు చేసేందుకు ఈ రోజే ఆటోమేటిక్ సేవింగ్స్ విధానాన్ని ప్రారంభించండి.
ఇది మీ జీవన విధానాన్ని మార్చడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఇంటికి తీసుకెళ్లే మొత్తాన్ని (టేక్ హోమ్ పే) పెంచుతుంది.
మీరు డైట్ చేస్తున్నపుడు కుకీ (బిస్కెట్) ను టీలో ముంచినట్లయితే మీ నడుము సైజు ఒక అంగుళం పెరిగిన విధంగానే.. పొదుపును తక్కువ చేయడం వలన మీ వ్యాలెట్ నగదు తగ్గుతుంది.
మిగతా అన్ని విధానాల మాదిరిగానే కఠిన నిబంధనలను పాటించడం అవసరమని మీరు భావించి ఉంటారు. కానీ అది తప్పు.
మీరు రూల్స్‌ను పాటించకపోతే ఇప్పటి వరకు చేసిందంతా కోల్పోతారు.
చాలా మంది పొదుపును వాయిదా వేస్తుంటారు. వారు పొదుపు చేసేందుకు తగిన మొత్తాన్ని సంపాదించడం లేదని వారు భావిస్తారు.
ఇది ఎలా ఉంటుందంటే.. ఒక వ్యక్తి కంప్యూటర్ ముందు కూర్చుని ప్రతి ఒక్కరికి అది చూపించేది మొత్తం అబద్ధం అని చెబితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
మీరు డబ్బు పొదుపు చేయడానికి ఎటువంటి అదనపు అర్హతలు అవరసం లేదు. మీ రూ. 1,000 పే చెక్‌లో రూ. 300 రూపాయలను ఆదా చేస్తే రూ. 1,00,000 పే చెక్‌లో రూ. 30,000 ఆదా చేయగలుగుతారు.
మీరు ఎక్కువ డబ్బును సంపాదించడం కోసం ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముఖ్యం కాదు. చాలా చిన్న వయసులో పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం.
మీరు ఎంత చిన్న వారైతే మీకు అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. వారెన్ బఫెట్ తన మొదటి స్టాక్‌ను 11 సంవత్సరాల వయసులోనే కొన్నాడు. ప్రస్తుతం అతడి సంపద 107 బిలియన్ అమెరికన్ డాలర్లు.
ఎవరైనా 11 సంవత్సరాలలోపు వయసులో డబ్బును ఆదా చేయకపోయినా, పెట్టుబడులు పెట్టకపోయినా మీకు అది ఎప్పటికైనా చిన్నచూపే.
సమయం అనేది డబ్బుతో సమానం. మీకు సహనం లేకపోతే మీరు ఎక్కువగా కోల్పోతారు. సహనం ఉంటే అధిక మొత్తాన్ని తిరిగి పొందుతారు. ఈ అదృష్టం ఎలా వస్తుందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మేము మీకు కొన్ని మ్యాజికల్ మూమెంట్లను గురించి వివరిస్తాం.
మీ డబ్బును బ్యాంకు అకౌంట్లో ఉంచడం వలన దాని విలువ పెద్దగా పెరగదు. డబ్బును బ్యాంక్ అకౌంట్లో ఉంచినా మీ మంచం మీద ఉన్న తలగడ కింద ఉంచినా పెద్ద తేడా ఉండదు.
దీనికి కారణం ద్రవ్యోల్బణం. ధరల పెరుగుదలలో అస్థిరత, డబ్బు విలువ పతనం కావడమే ద్రవ్యోల్బణం.
గత పదేళ్లలో చూసుకున్నట్లయితే భారతదేశంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 7.6 శాతం. అంటే మీరు ఈ రోజు రూ. 100 పొదుపు చేస్తే అవి తెల్లారేసరికి రూ. 92.4 అవుతాయన్నమాట.
కాబట్టి మన డబ్బుకు విలువ పెరిగే వరకు దానిని జాగ్రత్తగా భద్రపర్చాలి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి.
ధనవంతులు కావడానికి మొదటి అడుగు డబ్బును పొదుపు చేయడమే. దానిని తిరిగి పెట్టుబడి రూపంలో పెట్టి అధిక లాభాలను ఆర్జించడం రెండో దశ.
నేటి తరానికి డబ్బును పొదుపు చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ నుంచి ఇంటర్నెట్లో నడిచే క్రిప్టో కరెన్సీ వరకు దేనిలోనైనా పెట్టుబడులు పెట్టొచ్చు. లేదా పొదుపు చేయొచ్చు.
కానీ ఈ పెట్టుబడులన్నింటికీ రాబడి (కాంపౌండింగ్) చాలా ముఖ్యం. ఈ కాన్సెప్ట్ మీదనే అనేక మంది పెట్టబడులు పెడతారు.
చక్రవడ్డీ అనేది ప్రిన్సిపల్ అమౌంట్‌తో పాటు దానిపై వచ్చిన వడ్డీని కూడా లెక్కిస్తుంది. కావున ఈ పద్ధతిలో మీ రాబడి పెరిగే అవకాశం ఉంటుంది.
సులభంగా చెప్పాలంటే చక్రవడ్డీ అనేది వడ్డీపై వడ్డీ. బారు వడ్డీ కంటే ఈ పద్ధతిలో చాలా వేగంగా రాబడి పెరుగుతుంది. బారు వడ్డీ అనేది కేవలం అసలు మొత్తం మీద మాత్రమే లెక్కించబడుతుంది.
ఇంకా సులభంగా చెప్పాలంటే రూ. 100 పై 10 శాతం బారువడ్డీ లెక్కిస్తే మీకు రెండు సంవత్సరాలకు రూ. 120 వడ్డీ వస్తుంది. అదే చక్రవడ్డీని లెక్కిస్తే మీకు రూ. 121 వడ్డీ వస్తుంది.
ఈ రూపాయి తేడా మీకు చక్రవడ్డీపై అంతగా ఆసక్తి కలిగించకపోవచ్చు. కానీ చక్రవడ్డీ శక్తి ఏంటనేది మున్ముందు తెలుస్తుంది.
కానీ, వారెన్ బఫెట్ తన 65వ పుట్టిరోజు తర్వాత మాత్రమే తన ఖాతాలో 81.5 బిలియన్ యూఎస్ డాలర్లు కనిపించాయని చెప్పాడు. ఇక్కడ మీరు రెండు విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి.
● చక్రవడ్డీ అనేది మీ ప్రధాన మొత్తాన్ని, మీ వడ్డీ మొత్తాన్ని కలిపి పెంచడంలో మీకు బాగా సహాయపడుతుంది.
● చక్రవడ్డీని పొందేందుకు అనుమతించబడిన కాలం మీ సంపదను మరింతగా పెంచుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
వివరంగా చెప్పాలంటే 10 శాతం చక్రవడ్డీతో రోజుకు రూ. 100 పొదుపు చేయడం వలన 23 సంవత్సరాల 9 నెలల తర్వాత మీకు కోటి రూపాయలు లభిస్తాయి.
కోటి రూపాయల కోసం 23 సంవత్సరాలు వేచి ఉండటం అంటే కాస్త కష్టమే, ప్రత్యేకించి ఈ స్మార్ట్ యుగంలో. పదో తరగతి గణితంలో ఫెయిలయిన కుర్రాడు కూడా నేడు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి లక్షాధికారిగా మారుతున్నాడు.
కానీ మీరు కొనుగోలు చేసే ఒక సిగరెట్ ప్యాకెట్ ధర రూ. 200 అని గుర్తుంచుకోవాలి. మీరు రోజుకు రూ. 100 ఆదా చేసినా కానీ జీవిత చరమాంకం వరకు దాదాపు కోటి రూపాయలను ఆదా చేస్తారు. దుబారాగా ఖర్చు చేసే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ధనవంతులు ఎలా కావాలనే విషయాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. భవిష్యత్‌లో లాభాలను పొందండి. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టండి.
పెట్టుబడి పెట్టి అది చేసే మ్యాజిక్‌ను చూడండి. ఇప్పుడు చెట్లను నాటి భవిష్యత్‌లో వాటి ద్వారా వచ్చే నీడను ఆస్వాదించవచ్చు. హ్యాపీ ఇన్వెస్టింగ్.