Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
పోర్ట్‌ఫోలియోలో బంగారం కలిగి ఉండటం అనేది ఎప్పుడూ మంచిదే. ఎటువంటి ఆర్థిక ఒడిదొడుకులు ఉన్న సమయంలోనైనా బంగారంపై పెట్టిన పెట్టుబడులు మిమ్మల్ని ఆదుకుంటాయి. అదెలాగో తెలుసుకుంటారా?
మీరు కొత్తగా పెట్టుబడి పెడుతున్నవారైతే, ప్రస్తుతం పెట్టుబడి పెట్టేందుకు తగిన మంచి అవకాశాలు లేవనే విషయాన్ని తెలుసుకోవాలి (రిస్కు తీసుకోవడం మీకు ఇష్టమైతే తప్పా).
ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి నిర్దిష్ట వడ్డీ అందించే పెట్టుబడులతో మంచి రాబడులను రాబట్టడం చాలా కష్టం.
మరోవైపు, షేర్లు, ఈక్విటీలు మంచి ర్యాలీనే తీసినప్పటికీ, వాటిలో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్న పని.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే అంత లిక్విడిటీ ఉండదు. పైగా అవి దీర్ఘకాలిక పెట్టుబడులుగా పరిగణించబడుతాయి. దీన్నిబట్టి చూస్తే అంతటా అనిశ్చితే ఉన్నట్లు తెలుస్తోంది.
మరి బంగారం సంగతేంటి? గత పదేళ్లలో చూసుకుంటే, బంగారం ధరలు దాదాపు 300 శాతం మేర పెరిగాయి. లభ్యత కొరత వల్ల దీర్ఘకాలంలో బంగారం మీద పెట్టే పెట్టుబడులు మార్కెట్లతో పోల్చితే లాభాలను తీసుకువస్తాయని నిర్ధారణ అయింది.
మీరు డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెడితే ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారమే మీ దగ్గరున్న బంగారాన్ని అమ్ముకోవచ్చు.
దీన్నిబట్టి చూస్తే మిగతావాటితో పోల్చితే బంగారం మంచి పెట్టుబడి ఎంపిక అనిపించడం లేదా?
ఏ రూపంలోనైనా బంగారానికి పెట్టుబడులు, ట్రేడ్ల విషయంలో సుదీర్ఘమైన రికార్డు ఉంది. ఇది స్థిరమైనదే గాక విశ్వసనీయమైన ఎంపిక కూడా.
బంగారాన్ని కలిగి ఉండే విధానంలో మార్పులు వచ్చినప్పటికీ, బంగారంపై పెట్టుబడులు పెట్టే విధానం పోతుందనే అనుమానమైతే లేదు. ముఖ్యంగా దీర్ఘకాలంలో సంపద సృష్టించాలనుకునే ఇన్వెస్టర్లకు.
ప్రజలు ఇప్పుడు సంప్రదాయ రీతిలో భౌతిక బంగారంపై పెట్టుబడులు పెట్టడం నుంచి ఆన్లైన్, పేపర్ గోల్డ్ వైపు మళ్లారు. ఎందుకంటే, ఇప్పుడు ఇది చాలా సురక్షితమే గాక తెలివైన ఎంపిక కూడా.
సాధారణంగా బంగారం మీద పెట్టుబడిని వైవిధ్యభరితమైన పెట్టుబడిగా చూస్తారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇతర అధిక రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో వాటిల్లిన నష్టాలను ఇది న్యూట్రలైజ్ చేస్తుంది.
ఒడిదొడుకులు ఉండే మార్కెట్లలో కూడా ఇది మంచి రాబడులను అందించగలుగుతుంది. రిస్కు అంశాలను మెరుగుపరిచే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇతర పెట్టుబడులు నష్టాలను తీసుకొచ్చినా, బంగారం మీద పెట్టిన పెట్టుబడి మాత్రం వృద్ధి చెందుతూనే ఉంటుంది.
కానీ, దానికంటే కూడా ఉత్తమమైన ఎంపిక ఏంటో మీకు తెలుసా? డిజిటల్ గోల్డ్.
డిజిటల్ గోల్డ్ అనేది భౌతిక బంగారానికి ఆధునిక ప్రత్యామ్నాయం. ఇది మారకపు రేటు జిమ్మిక్కులు, మార్పులకు లోను కాదు. మీరు భౌతిక బంగారాన్ని తాకకుండానే ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అవును.
ఆన్లైన్లో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఇదో సురక్షితమైన, అనువైన, తక్కువ ధర గల మార్గం. పైగా, దీనిలో స్టోరేజీ చార్జీలు, రవాణా చార్జీలు అంటూ అదనపు ఖర్చు ఏమీ ఉండదు.
మార్కెట్ స్థితి గతులను అర్థం చేసుకునేంత వరకు సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రతీ ఒక్కరికి ఇది మంచి ఎంపిక.
ఇది డివిడెండ్ చెల్లించే ఒక ఆస్తి. బంగారం ధరలో చిన్న పాటి పెరుగుదల ఉన్నా, టాప్ గోల్డ్ స్టాక్స్‌లో గణనీయమైన లాభాలు వస్తాయి. మీరు గోల్డ్ స్టాక్ ఓనర్ అయితే, మీరు ROI లో పెట్టుబడులు పెట్టడం ద్వారా నిజమైన బంగారం యజమానుల కంటే ఎక్కువ లాభాలను ఆర్జిస్తారు.
మనం ఎందులో పెట్టుబడులు పెట్టినా, దానిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. డిజిటల్ గోల్డ్ గురించి మీరు పూర్తి సమాచారాన్ని ఇక్కడ, భౌతిక బంగారం, డిజిటల్ గోల్డ్ తేడాల గురించి ఇక్కడ తెలుసుకొని మీ జ్ఞానాన్ని పెంచుకోండి.
దీనికంటే మంచి పెట్టుబడి ఆప్షన్లు కూడా ఉన్నప్పటికీ వాటిలో అంతేస్థాయిలో రిస్కు కూడా ఉంటుంది.
అందుకే చాలామంది తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును రిస్కు ఉండే వాటిలో పెట్టుబడి పెట్టడానికి అంత ఆసక్తి చూపించరు.
అంతేగాక వారికి ఎక్కువ మూలధనం అవసరం పడవచ్చు. అది వారి స్తోమతకు మించి కూడా ఉండవచ్చు.
ఇంకా, ఒక అధ్యయనం ప్రకారం యువ భారతీయులు సగటున తమ జీతంలో కేవలం 10 శాతం కంటే తక్కువే పొదుపు చేస్తున్నారని తేలింది.
ఈ సంఖ్య కొంచెం ఆందోళన కలిగిస్తుంది! మీరు నిశ్చింతగా పదవీ విరమణ చేయాలనుకుంటే దశాబ్దాల పాటు మీ సంపాదనలో 15 శాతాన్ని పక్కన పెట్టుకోవడం చాలా మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మీరు ఇప్పుడే సంపాదించడం ప్రారంభించినా లేదా పెట్టుబడులు పెట్టడంలో మీరు రూకీ (ఏదైనా రంగంలో కొత్తవారు) అయితే సరైన పెట్టుబడులు పెట్టడం ఎలా అని అనుకుంటున్నారా? వాటన్నింటికీ సమాధానమే జార్ యాప్.
మేము మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే భాగస్వామి లాంటివాళ్లము. మీ రోజువారి ఖర్చుల నుంచి మీరు పొదుపు చేసుకునేలా, ఎప్పటికీ వన్నె తరగని డిజిటల్ గోల్డ్‌లో ఆటోమేటిక్‌గా పెట్టుబడి పెట్టేలా మేము మీకు సాయపడుతాం.
మీ సేవింగ్స్‌ను ఆటోమేట్ చేయడం అనేది పొదుపు చేసే అలవాటును అలవర్చుకోవడానికి సులభమైన పద్ధతి.
కేవలం ఒక జార్ అకౌంట్‌ను రూపొందించుకొని మీ డబ్బును డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టండి. మీ జీతానికి తగినట్లు మీ జీవన విధానాన్ని సవరించుకోవడానికి ఇది మీకు సాయపడుతుంది.
ఇక్కడ మీరు కేవలం రూ. 1 నుంచి కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఎప్పుడంటే అప్పుడు పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చు. ఎటువంటి కేవైసీ లేదా స్టోరేజ్ వంటి సమస్యలే ఉండవు.
పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి, లాభదాయక ఎంపిక. ఇంకా వేచి చూడకండి. వెంటనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి!