Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
ప్రతీ ఒక్కరూ ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటారు, కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే దానిని సాధిస్తారు. దానికి కారణం ఏమై ఉంటుంది? ఆర్థికంగా స్వతంత్రత సాధించినవారు కూడా ఆర్థికంగా అక్షరాస్యులు అయి ఉండటమే దానికి కారణం.
అనుకోకుండా మన ఫోన్ రిపేర్ బిల్లునో లేదా ల్యాప్‌టాప్ రిపేర్ బిల్నో చూసినప్పుడు మనకు అదోలా అనిపిస్తుంది. కదా? మనం చెల్లించబోయే దాని గురించి చింతిస్తాము.
ఒకవేళ ఆ ల్యాప్‌టాప్ లేదా ఫోన్ రిపేర్ బిల్లు చిన్నదే అయితే? దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, ఎలాంటి చిరాకు లేకుండా బిల్ కట్టి వారం తర్వాత మర్చిపోతారు. అంతేకదా! ఇది మీ ఆర్థిక పరిస్థితిపై కొంత మొత్తంలో మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఏదో అత్యవసర పరిస్థితిలా కాకుండా మనకు వెక్కిళ్లు వచ్చినట్లు మాత్రమే అనిపిస్తుంది.
అదే ఆర్థిక స్వేచ్ఛ
ఆర్థిక స్వేచ్ఛ అంటే, ప్రాథమికంగా ఒక మానెటరీ స్టేజ్. దీనిలో మీ ఖర్చులను కవర్ చేయడానికి మీ దగ్గర తగినంత డబ్బు ఉంటుంది. మీరు జీవనోపాధి కోసం పని చేయాల్సిన అవసరం లేదు లేదా మీ ఖర్చులు భరించడానికి మీకు ఆదాయ వనరులు ఉండాల్సిన అవసరం లేదు.
మీరు బాగా సిద్ధమై ఉన్నందున ఊహించని సంఘటనల వల్ల ఎదురయ్యే ఆర్థిక పరిణామాల గురించి మీరు అనవసరంగా ఆందోళన చెందరు.
మీ వద్ద ఉన్న డబ్బు అనేది, మీరు డబ్బు కోసం పనిచేసేటప్పుడు సంపాదించగలిగిన దానికంటే ఎక్కువ సంపాదించినప్పుడు ఇది సాధ్యమవుతుంది!
మీరు ఆర్థిక సమస్యలలో చిక్కుకుపోకుండా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉంటారు. మీ డబ్బు మీకు వ్యతిరేకంగా కాకుండా మీకోసం పనిచేస్తుంది. మనమందరం కలలు కనేది, దానికోసమే కదా?
ఒకసారి మీరు ఆర్థిక స్వేచ్చ సాధించిన తర్వాత, మీ అభిరుచులను కొనసాగించడం ప్రారంభిస్తారు - సంగీతం, క్రీడలు, కళలు, ప్రపంచ పర్యటన మొదలైనవి.
దీని అర్థం కోటీశ్వరులుగా ఉండటం, విలాసవంతమైన జీవితాన్ని గడపడం అని కాదు. మీ అవసరాలకు సరిపడా డబ్బును కలిగి ఉండటం.
అయితే, మీరు ఆర్థికంగా అక్షరాస్యులైతేనే ఇవన్నీ సాధించవచ్చు, దురదృష్టవశాత్తు మన దేశంలో ఇదే పెద్ద సమస్య.
ఆర్థిక వ్యవహారాలను మంచిగా నిర్వహించుకోగలిగితే అది మన జీవన విధానాన్ని మార్చగలదు. మన భవిష్యత్తు ఎంత సురక్షితంగా ఉంటుందో నిర్ణయించగలదు. కానీ చాలా మందికి దాని గురించి తెలియదు.
2019లో నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన పోల్ ప్రకారం, 80% మంది భారతీయులు అక్షరాస్యులే అయినప్పటికీ, వారిలో కేవలం 27% మంది మాత్రమే ఆర్థికంగా అక్షరాస్యులు.
ఒక వ్యక్తి సంపాదన ప్రారంభించిన సమయానికి, అతను పెట్టుబడి పెట్టడం ప్రారంభించే సమయానికి మధ్య సగటున 10 సంవత్సరాల విరామం ఉంటుంది. ఇది భ్రాంతి కలిగించే సంఖ్యే కదా!
ఆర్థిక ప్రభావం గురించి అతిగా ఒత్తిడికి గురికాకుండా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ఎలా సాధ్యమో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
మీరు ఆర్థికంగా అక్షరాస్యులు కావడంతో పాటు మీ ఖర్చులు మిమ్మల్ని నియంత్రించే ముందే మీరే వాటిని నియంత్రించుకోగలగాలి.
ప్రస్తుతం, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను ప్రమాదంలో పడవేయడంతో పాటు లెక్కలేనంత మందిని ఆర్థికంగా నాశనం చేసింది.
ఈ పరిస్థితి మనకు నేర్పిన అనేక ముఖ్యమైన పాఠాలలో ఆర్థికంగా సిద్ధంగా ఉండటం యొక్క ఆవశ్యకత ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు.
ఆర్థిక అక్షరాస్యత.. సులభంగా చెప్పాలంటే ఒకరు తమ వనరులు, ఆదాయాన్ని మేనేజ్ చేసుకోవడానికి ముందస్తు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా, ఇది బలమైన ఆర్థిక వ్యూహాన్ని రూపొందించే సామర్థ్యం. ఇది మీ వ్యక్తిగత ఆనందంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే ప్రాథమిక జీవన నైపుణ్యం.
కాబట్టి, ఇది పాఠశాలలు, కళాశాలల్లో పాఠ్యాంశంలాగా బోధించబడాలి. అప్పుడే మనం ముందు నుంచే సరైన ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్చుకుంటాము.
చిన్న వయస్సులో పర్సనల్ ఫైనాన్స్‌తో పాటు డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన నైపుణ్యాలను నేర్చుకుంటే వాటిని నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి - బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడం, క్రమం తప్పకుండా పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం, తెలివిగా ఖర్చు చేయడం వంటి అనేక అవకాశాలు లభిస్తాయి.
ఒకవేళ మనం ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యూహాన్ని కొనసాగించలేకపోతే, నిపుణుల నుంచి సలహా తీసుకోవడం ముఖ్యం.
ఇక్కడే ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ ప్లానింగ్ వెబ్సైట్లు, అప్లికేషన్లు సహాయపడవచ్చు. ఇప్పుడు మొత్తం సమాచారాన్ని మనం యాక్సెస్ చేయడానికి వీలు కల్పించిన ఇంటర్నెట్కు ధన్యవాదాలు.
గూగుల్ సెర్చ్‌లో సులభంగా సెర్చ్ చేస్తే మీకు కావాల్సిన ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన విషయాలు, కీలక ప్రాథమిక అంశాలు, వేల మంది ఆర్థిక నిపుణులు మీకు అందుబాటులో ఉంటారు.
మీరు ఆర్థిక స్వేచ్ఛ కోసం మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ కొన్ని అలవాట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి:
మీకు అప్పు ఉన్నట్లయితే, దానిపై వడ్డీ మీరు కట్టాల్సిన పేమెంట్ కంటే వేగంగా పెరగవచ్చు.
ఇది డబ్బు మీద మీ నియంత్రణను దెబ్బతీస్తుంది. దీంతో మీరు డబ్బుల విషయంలో ఇబ్బంది పడవచ్చు.
అప్పులేని జీవితం కోసం మీరు పని చేస్తే అది మీకు ఆ శక్తిని తిరిగి అందించడంతో పాటు మిమ్మల్ని ఆర్థిక స్వాతంత్రం వైపు నడిపిస్తుంది.
సరైన ప్రణాళిక లేకుండా మీరు ముందుకు సాగలేరు. ఇది కష్టంగా ఉంటుందని మాకు కూడా తెలుసు, కానీ, జీతం మీద మాత్రమే ఆధారపడి జీవించడం మీరు మానుకోవాల్సిందే.
అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం అనేది ఆర్థిక స్వేచ్ఛ సాధించడంలో చాలా ముఖ్యమైన అడుగు.
ఆ అత్యవసర నిధి ఉంటే, మీరు జీవితంలో ఎదురయ్యే అనుకోని విపత్తులను ధైర్యంగా ఎదుర్కొనవచ్చు.
మీ అప్పులన్నీ తీరిన తర్వాత అత్యవసర నిధి కోసం పొదుపు చేయడం ప్రారంభించండి. రోజువారీ ఖర్చుల నుండి బయటపడి అత్యవసరం కాని ఖర్చులైన పదవీ విరమణ, పిల్లల చదువు, మార్టిగేజ్ లేదంటే విహారయాత్ర లాంటి వాటి కోసం పొదుపు చేయడం మొదలు పెట్టండి.
అదే సమయంలో మీరు మీకు వచ్చే డబ్బును ఎలా విభజిస్తారనేది కూడా ఎంతో ముఖ్యం.
మీ బిల్లులను కడుతూనే మీరు అనుకున్న వాటి కోసం ఎలా పొదుపు చేస్తారనే దానిపైనే మీ ఆర్థిక స్వేచ్ఛ ఆధారపడి ఉంటుంది.
అలాగే మీ పెట్టుబడి ఆప్షన్ల గురించి కూడా తెలుసుకోవాలి.
సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అనేది మొదటి దశ. కానీ, మీ డబ్బును మేనేజ్ చేయడానికి, మీ జీవితాంతం దానికి అనుగుణంగా ఉండటానికి కట్టుబడి ఉండటం మాత్రం చాలా కీలకం.
మీ ఆర్థిక లక్ష్యాలను మెరుగుపరచుకోవడం కొరకు మీరు కొన్ని విషయాలపై కఠినంగా ఉండాల్సి ఉంటుంది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి మీకు అత్యుత్తమ అవకాశాన్ని అందిస్తుంది.
మీ పెట్టుబడులను ఆటోపైలెట్ పై విడిచిపెట్టడం వల్ల పెద్దగా విలువ ఉండదు. మీరు మీ డబ్బును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. మారుతున్న కాలానికి మీరు ఎటువంటి మార్పులు చేయాలో తెలుసుకోవడానికి దాని యొక్క ప్రతి మూలను విశ్లేషించాలి.
ఆర్థిక స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనదే. కానీ, అది మీ పరిస్థితులను బట్టి సమయం కూడా తీసుకుంటుంది. ఇది లక్ష్యాలను ఏర్పరుచుకోవడం, ఖర్చును తగ్గించడం మాత్రమే కాదు, డబ్బుతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని నిర్మించడం కూడా.
కానీ ఒకసారి మీరు దానిని సాధించిన తరువాత, మీ భవిష్యత్తు సురక్షితంగా ఉందని తెలుసుకున్నప్పుడు మీరు కోరుకున్నది చేయగలరు.
దీన్ని ఒక చిన్న అడుగుతో ఎలా ప్రారంభించవచ్చో మీకు తెలుసా? జార్ యాప్ ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభించడం ద్వారా. ఇది ఒక ఆటోమేటెడ్ డైలీ సేవింగ్స్ యాప్. ఇది మీ జేబుకు ఎలాంటి చిల్లులు పెట్టదు.
మీ డబ్బు ఆటోమేటిక్‌గా డిజిటల్ గోల్డ్‌లో చిన్న పెట్టుబడి ప్రణాళికలతో పెట్టుబడి పెట్టబడుతుంది. ఇది మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా ఉండాలని అందరికీ తెలుసు.
జార్ యాప్ ఎలా పనిచేస్తుంది, మీ డబ్బును ఎలా ఆదా చేస్తుంది, అదే సమయంలో డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం గురించి మరింత చదవండి. ఈ విధంగా మీ డబ్బు కేవలం ఆదా చేయబడటం మాత్రమే కాదు, పెరుగుతుంది కూడా.