Playstore Icon
Download Jar App
Savings

ఆటోమేటిక్​ సేవింగ్స్​ నుంచి ఆటోమేటిక్​ రివార్డుల వరకు - జార్ యాప్

December 28, 2022

పొదుపు చేయడం కంటే ఉత్తమమైన పని ఏమిటి? పెట్టుబడి పెట్టడం, దానిపై రివార్డులను పొందడం. డిజిటల్ గోల్డ్‌లో పొదుపు చేసినందుకు జార్ మీకు ఆటోమేటిక్‌ రివార్డులను ఎలా అందిస్తుందో తెలుసుకోండి.

డబ్బును పొదుపు చేయడంలో ఇబ్బంది పడుతున్నారా? డబ్బును ఆదా చేయాలని మీకు తెలుసు, ఎలాగైనా ఆదా చేయాలని అనుకుంటున్నారు, కానీ మీరు అలా చేయడం లేదు.

ఇంక పెట్టుబడి పెట్టడం సంగతి పక్కన పెట్టండి. మీకు జార్ అవసరం - ఇది ఒక ఆటోమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్. ఇది డిజిటల్ గోల్డ్‌లో డబ్బును అత్యంత సులభంగా, వేగవంతమైన మార్గంలో పొదుపు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశం కల్పిస్తుంది.

మీరు డబ్బును ఆదా చేసే, పెట్టుబడి పెట్టే విధానాన్ని మార్చడం.

దానికంటే ఇంకా ఉత్తమం ఏంటో తెలుసా? రివార్డులను కూడా పొందగలగడం. మీరు చేయాల్సినదల్లా ఖర్చు చేయడం అంతే! మేమేమీ జోక్ చేయడం లేదండీ!

డబ్బును ఆదా చేయడంలో జార్ మీకు సహాయం చేయాలని అనుకుంటుంది. కాబట్టి మీరు క్రమం తప్పకుండా ఆదా చేస్తే మేము మీకు రివార్డులను అందిస్తాము. ఆదా చేయండి, ఆదా చేయండి, అలా చేస్తూనే ఉండండి, దానికి తగిన ప్రయోజనాలను పొందండి.

జార్ ఎలా పని చేస్తుంది?

జార్ అనేది ఒక డైలీ గోల్డ్ సేవింగ్స్ యాప్. ఇది డబ్బును ఆదా చేయడాన్ని మీకు ఒక సరదా అలవాటుగా మారుస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో ఖర్చు చేసిన ప్రతిసారీ కొద్ది మొత్తంలో చిల్లర డబ్బును పెట్టుబడి పెడుతుంది. 

నిజానికి ఒక పిగ్గీ బ్యాంక్ లాగా అనుకోండి. జార్ మీ ప్రతీ ఖర్చును గుర్తించడానికి మీ ఫోన్​లోని ఎస్​ఎంఎస్​ల​ను ఉపయోగించుకుంటుంది. మీరు చేసిన ఖర్చును దాని సమీప 10కి రౌండ్-ఆఫ్ చేసి కొంత అదనపు చిల్లరను మిగులుస్తుంది.

ఇప్పుడు మీరు రూ. 198తో మీ మొబైల్‌కి రీఛార్జ్ చేసినట్లయితే, జార్ యాప్ మీ ఎస్​ఎంఎస్​ ఫోల్డర్‌లో రీఛార్జ్ నిర్ధారణకు వచ్చిన సందేశాన్ని గుర్తించి, దాన్ని రూ. 200 లకు రౌండ్-ఆఫ్ చేస్తుంది. మీ బ్యాంక్ ఖాతా (మీ యూపీఐ ఐడీకి జోడించబడింది) నుండి (200 - 198 = రూ. 2) మిగులు మొత్తాన్ని డిజిటల్ గోల్డ్‌లో మీ తరపున పెట్టుబడిగా పెడుతుంది. తెలివైన పని కదా?

జార్ యాప్ ఆటోమేటిక్‌గా ఈ మిగులు చిల్లరను 99.9% స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెడుతుంది. ఇది ప్రపంచ-స్థాయి వాల్ట్‌లలో పూర్తిగా భద్రపరచబడుతుంది. ఆ బంగారానికి భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులచే హామీ ఇవ్వబడుతుంది.

మీరు మీ ఖాతాలో ఆటో పే ఫీచర్‌తో ఒక నిర్దిష్ట మొత్తాన్ని కూడా సెట్ చేసి ప్రతిరోజూ డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. లేదా మీరే మాన్యువల్‌గా కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

మీరు ఈరోజు నుండే ఆదా చేస్తూ, పెట్టుబడి పెట్టడం ప్రారంభించేందుకు కావలసిన కిక్‌ని అందించడానికి మేము కొన్ని అద్భుతమైన రివార్డులు, ఆఫర్లను మీకు అందిస్తున్నాము:

1. ప్రతీ కొనుగోలుపై అదనపు బంగారం

అవును, మీరు సరిగ్గానే చదివారు. మీరు ఇప్పుడు జార్ యాప్‌లో ప్రతీ కొనుగోలుపై ఉచిత బంగారాన్ని పొందుతారు.

 • రూ.500 మరియు అంతకంటే ఎక్కువ నగదుతో బంగారాన్ని కొనుగోలు చేసి 2% అదనపు బంగారాన్ని ఉచితంగా పొందండి!
 • రూ.5000 మరియు అంతకంటే ఎక్కువ నగదుతో బంగారాన్ని కొనుగోలు చేసి 3% అదనపు బంగారాన్ని ఉచితంగా పొందండి!

2. గోల్డెన్ మైల్‌స్టోన్స్

మైల్‌స్టోన్ చేరుకొని, మీరు సాధించిన ప్రతి మైల్‌స్టోన్‌కి స్పిన్‌లు, అదనపు బంగారాన్ని పొందండి.

 • ప్రతి 0.5 గ్రాముల మైల్‌స్టోన్‌ని సాధించడం ద్వారా 2% అదనపు బంగారాన్ని పొందండి.
 • ప్రతి 0.1 gm మైల్‌స్టోన్‌ని సాధించడం ద్వారా అదనపు స్పిన్‌లను పొందండి (మీ సేవింగ్స్‌ని  రెట్టింపు చేసుకునే అవకాశం పొందవచ్చు).

3. రిఫర్ చేసి సంపాదించండి: సంవత్సరమంతా 

మీరు రిఫరల్స్‌తో కూడా సంపాదించుకోవచ్చు. ఈరోజే రిఫర్ చేసి ఒక సంవత్సరం వరకు ప్రయోజనాలను పొందండి. మీ ఆహ్వాన లింక్‌ని ఉపయోగించి ఇన్‌స్టాల్ చేసి సైన్ అప్ చేయమని మీ స్నేహితులని అడగండి.

 • రోజువారీ పెట్టుబడి, స్పిన్ రివార్డ్‌లను సేకరించడం ద్వారా 2% అదనపు రివార్డ్‌లు.
 • మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను రిఫర్ చేయడం ద్వారా వారానికి 2-3% విలువైన అదనపు ప్రయోజనాలు.
 • ప్రతీ రిఫరల్ చేసే ప్రతీ లావాదేవీపై 1% కమీషన్ పొందండి - 1 సంవత్సరం వరకు.

4. స్పిన్ ది వీల్

ప్రతీ లావాదేవీతో జార్ యాప్‌లోని వీల్ ఆఫ్ సేవింగ్స్‌లో స్పిన్‌ను గెలుచుకోవచ్చు. జార్‌లో మీ పొదుపులను రెట్టింపు చేసుకునే అవకాశం లేదా గేమ్‌లు ఆడటం ద్వారా అద్భుతమైన క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకునే అవకాశాన్ని పొందండి.

మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి అనుకూలంగా 'జార్'లను ఏర్పాటు చేసుకోవచ్చు:

 • మీ వివాహం కోసం బంగారం కొనండి.
 • మీ తల్లిదండ్రుల వార్షికోత్సవం కోసం బహుమతిని కొనుగోలు చేయడానికి డబ్బు ఆదా చేయండి.
 • మీ తదుపరి ఒంటరి లేదా కుటుంబ విహారయాత్ర కోసం ఆదా చేసుకోండి.
 • మీ పిల్లల చదువు కోసం ఫైనాన్స్ ప్లాన్ చేయండి.
 • మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా మీకు ఇష్టమైన స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఫైనాన్స్ ప్లాన్ చేయండి.
 • మెరుగైన డబ్బు నియంత్రణ, ఆర్థిక నియంత్రణ కోసం డబ్బును ఆదా చేయండి.
 • సురక్షితమైన భవిష్యత్తు కోసం డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయండి.
 • మీ కలల కారు, ఇల్లు, ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయడానికి ఆర్థిక ప్రణాళిక చేయండి.
 • అత్యవసర సమయంలో అవసరమయ్యే డబ్బు కోసం ఫైనాన్స్ ప్లాన్ చేయండి.

ఆటోమేటిక్ సేవింగ్స్ టు ఆటోమేటిక్ రివార్డ్స్‌తో, జార్ మీ పెట్టుబడి ప్రయాణాన్ని సరళమైన విధానంతో సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

మీ సేవింగ్స్, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడిగా ఉండేందుకు జార్‌కు అవకాసం ఇవ్వండి! ఈరోజే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.