Playstore Icon
Download Jar App
Savings

ఐటీఆర్​ (ITR) రీఫండ్ వచ్చిందా? మీ డబ్బును తెలివిగా వాడుకొనే 5 మార్గాలు ఇదిగో!

December 29, 2022

మీ ఇన్​కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చాక మీ డబ్బు మీకు ఉపయోగపడేలా చేసుకునే 5 మార్గాలు.

మన అకౌంట్​లోకి డబ్బు రావడం అనేది ఒక మంచి అనుభూతి! అయినా కూడా, అంతకంటే గొప్ప ఫీలింగ్ ఏంటో తెలుసా? ఐటీఆర్​ (ITR) సబ్మిషన్ తర్వాత టీడీఎస్​లో డిడక్ట్ అయిన డబ్బు రావడం! 

మీకు మీ 2021 ఇన్​కమ్ ట్యాక్స్ రీఫండ్ వచ్చి ఉంటే, మీ డబ్బును తెలివిగా ఉపయోగించే మార్గాలు ఇక్కడ ఇచ్చాం. మీరు ఆన్​లైన్​లో ఐటీఆర్​ (ITR) ఎలా దాఖలు చేయాలి అని ఆలోచిస్తున్నట్టయితే ఇది చదవండి.


దాన్ని సేవింగ్స్​లా దాచుకోండి

డబ్బులు దాచుకోవడం అంటే ఒక మంచి డైట్​ ఫాలో అవడం లాంటిది - మీకు అది చేయాలని తెలుసు కానీ, తోచింది కొనేద్దాం అనిపించే ఆతృత లాంటివి ఆపుకోవడానికి అది తరచుగా చేస్తూనే ఉండాలి.

ఇలా ఒక బలహీన క్షణంలో కలిగే ఆతృతను తగ్గించుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ, మీ ట్యాక్స్ రీఫండ్ డబ్బును దూరంగా ఉంచడం, మీకు నిజంగా అవసరమైనప్పుడు డబ్బును ఉపయోగించుకోవడానికి ఆ దాచుకోవడం చాలా మంచిది.

ఇలా చేయడానికి ఉత్తమమైన మార్గం ఏంటి? ఈ డబ్బును మీరు ఖర్చు పెట్టడానికి చాలా అరుదుగా ఉపయోగించే అకౌంట్​లో వేసేయండి.

ఈ డబ్బును చూపుకి, మనసుకు దూరంగా ఉంచడం ద్వారా మీరు అనవసరంగా కొనే ఆశలను తగ్గించుకోవచ్చు.


డబ్బును అత్యవసరాల కోసం పక్కన పెట్టండి

అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్​) ఎప్పుడైనా అవసరం పడవచ్చు. ఉద్యోగం పోయినప్పుడు, లేదా అనారోగ్యం వచ్చినా లేదా ఇంకేవైనా తెలియని అత్యవసర ఖర్చులలాంటి పరిస్థితులలో అత్యవసర నిధి ఉంచుకుంటే మనకు ఎంతో అండగా ఉంటుంది.

మీకు బ్యాకప్ ప్లాన్‌ ఉంటుంది కనుక ఇష్టం లేని ఖర్చుల విషయంలో మీకు తిరిగి వచ్చిన డబ్బును ఉపయోగించడం వలన మీరు మీ ఫైనాన్స్‌ విషయంలో అగ్రస్థానంలో ఉండేందుకు సహాయపడుతుంది.

మీ అత్యవసర నిధితో, మీరు ఊహించని మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కోవచ్చు లేదా ఎక్కువ వడ్డీ ఉండే చిన్న చిన్న రుణాలను కట్టేయవచ్చు, లేదా మనం ఊహించని ఇంటి మరమ్మతును చేయించవచ్చు.

అప్పు కట్టేయండి

 

అప్పులు ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. మీరు బడ్జెట్ కష్టంగా ఉండి మీకు జీతం రాగానే డబ్బు కట్టవలసి ఉన్నప్పుడైతే మరీను. 

ఇవి మీ ఫోన్‌లో ఉండే లాంగ్ టర్మ్ ఈఎంఐ కావచ్చు, లేదా విదేశాల్లో విహార యాత్రకు వెళ్లినప్పటి లోన్ కావచ్చు లేదా ఎప్పటినుంచో కట్టాల్సిన క్రెడిట్ కార్డ్ బిల్లు కావచ్చు.

మీకు అలాంటి అప్పులు ఉంటే, మీ బకాయి కట్టేయడానికి మీ ట్యాక్స్ రిటర్న్ ఖర్చు చేయడం తెలివైన పని.

ఎందుకంటే, మీరు 2% వడ్డీని వచ్చే ఫండ్‌లో రూ. 30,000 పెట్టుబడి పెట్టి, రూ. 27,000 క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను తీసుకుని, 18% వడ్డీ కడుతుంటే దానివల్ల ఏ మాత్రమూ ఉపయోగం ఉండదు.

మీకు చాలా రుణాలు ఉన్నట్లయితే, వాటికి అయ్యే వడ్డీ రేట్లను బట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో తెలివైన పని.

ఎక్కువ వడ్డీ రేట్లు ఉండి, పన్ను ప్రయోజనాలు లేనివాటిని ముందు కట్టేయండి.

మీకోసం ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి

 

మీరు 20 లలో ఉంటే, మీ ఇన్​కమ్​ ట్యాక్స్ రీఫండ్​తో జీవిత బీమా తీసుకోవాలని అంతగా అనుకోరు! కానీ అది ఎందుకు చేయాలో మేము మీకు చెప్తాము.

చిన్న వయస్సులో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అత్యవసర పరిస్థితుల్లో మీకు మీ కుటుంబ సభ్యులకు రక్షణ ఉంటుంది. ‍

మీకు పెళ్లి అయి కుటుంబం ఉంటే కనుక ఒక ఇన్సూరెన్స్ ఉంచుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే మీ జీవితంలో జరగకూడనిది ఏదైనా జరిగితే మీ వాళ్లకు అది ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ ఏడాది మీ రీఫండ్ ఎక్కువగా ఉంటే మీరు ఒకేసారి కట్టేసే టర్మ్ పాలసీ ఎంచుకోవచ్చు.

మీరు ఒకసారి కడితే చాలు, మీకు 60 ఏళ్ళు వచ్చేవరకు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది.

మిగతావాళ్ళు, ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని మీ రిటర్న్​లను సీడ్ మనీలాగా పెట్టుకొని ఈ ఖర్చును మీ బడ్జెట్​లో చేర్చుకోండి.


పదవీ విరమణ కోసం దాచుకోండి

మీరు నాది కాదనుకున్న డబ్బును మీ మలి దశ కోసం దాచుకోవడం కంటే మంచి విషయం ఏదీ ఉండదు. 

ఈ అదనపు డబ్బుతో పదవీ విరమణ ఫండ్ తీసుకోవడం లేదా దాన్ని పెంచడం సాధ్యమే. అది మీరు ఉద్యోగం చేయలేని సమయంలో మీకు రక్షణగా ఉంటుంది.

నాది కాదని మీరు వదులుకున్న డబ్బుతో నచ్చినదేదో సరదాపడి కొనేసుకునే బదులు మీ పదవీ విరమణ కోసం దాచుకుంటే, ఆ రోజు వచ్చినప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు.

తెలివిగా డబ్బు‍ ఖర్చుపెట్టడం ఎలా? అనే ప్రశ్నకు అత్యుత్తమ సమాధానాల్లో ఇదీ ఒకటి.

ఇక చివరగా… 

పొదుపు చేయడం లేదా పెట్టుబడి పెట్టి ఆ డబ్బును పక్కన పెట్టే ఉద్దేశ్యం మీకు లేదా? అయితే దాన్ని రకరకాలుగా ఖర్చు పెట్టే మంచి మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో నుంచి దేనినైనా ఎంచుకోండి. 

అన్నట్టు, మీరు డిజిటల్ గోల్డ్​ కోసం డబ్బు ఖర్చు పెడితే మంచిది కాదని ఎవరంటారు?  Jar లో, మేము అదే చేస్తాము.

కాబట్టి, మీ డబ్బును  జార్​ యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్​లో పెట్టుబడి పెట్టండి.

మరి, తెలివిగా డబ్బు ఖర్చు పెట్టడం అంటే అదే, కదా?

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.