Buy Gold
Sell Gold
Daily Savings
Digital Gold
Instant Loan
Round-Off
Nek Jewellery
అందరికీ తెలిసినప్పటికీ కూడా ఫైనాన్షియల్ డాక్యుమెంట్లలోని పదాల విషయానికి వస్తే మనకి ఒక్కోసారి ఏమీ అర్థం కాదు. అందుకే మనం ఇప్పుడు గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం.
మీరు ఇప్పుడే ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. నెలాఖరులో మీరు ఎంత సంపాదిస్తారో మీకు సరిగ్గా తెలియట్లేదా?
చింతించకండి. మీకు మేము చెప్తాము. మీరు అందించే సేవలకు బదులుగా మీ యజమాని నుండి ప్రతి నెలా డబ్బు రూపంలో పొందే ప్రతిఫలమే జీతం. అవునా?
ఈ మొత్తాన్ని గ్రాస్ శాలరీ అంటారు. అయితే, మీ గ్రాస్ శాలరీ, నెట్ పే మధ్య తేడా ఎందుకు ఉందో మీకు తెలుసా? చూద్దాం రండి.
గ్రాస్ శాలరీ అనేది ఒక ఉద్యోగిగా మీ జీతం యొక్క ప్యాకేజీని తయారుచేసే అన్ని కాంపోనెంట్ల మొత్తం.
ఆదాయపన్ను, ప్రావిడెంట్ ఫండ్, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి తప్పనిసరైన, ఆప్షనల్ డిడక్షన్లు చేయక ముందు మీకొచ్చే జీతం ఇది.
ఓవర్ టైమ్ పేమెంట్, ఇన్సెంటివ్స్ కూడా మీ గ్రాస్ శాలరీలో కలిసే ఉంటాయి.
మీ ఎంప్లాయి పే స్లిప్‌లో మీ గ్రాస్ శాలరీలో ఉన్న డిడక్షన్లు, వాటి ప్రయోజనాలకు సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయి.
1. బేసిక్ శాలరీ (మూల వేతనం)
2. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)
3. హౌసింగ్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)
4. కన్వేయన్స్ అలవెన్స్
5. లీవ్ కన్వేయన్స్ అలవెన్స్
6. పర్ఫార్మెన్స్ అలవెన్స్, స్పెషల్ అలవెన్సులు
7. ఇతర అలవెన్సులు
ఇక్కడ శాలరీ స్లిప్ లోని అంశాల గురించి మరింత చదవండి.
ఇప్పుడు వచ్చేది అన్నింటికంటే ముఖ్యమైనది,
మీకు అన్ని కాంపోనెంట్స్‌పై సరైన, కచ్చితమైన అవగాహన వస్తే ఇది చాలా సులువు. ఒక ఉదాహరణతో దీన్ని బాగా అర్థం చేసుకుందాం.
అఫ్రీన్ అనే ఒకావిడ ఉందనుకుందాం.
ఆమె ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె శాలరీ స్ట్రక్చర్ ఇది:
కాబట్టి, గ్రాస్ శాలరీ సూత్రం ప్రకారం, ఇది:
గ్రాస్ శాలరీ = మూల వేతనం + హెచ్ఆర్ఏ + ఇతర అలవెన్సులు
గ్రాస్ శాలరీ = ₹5,00,000 + ₹45,000 + ₹1,55,000
గ్రాస్ శాలరీ = ₹7,00,000
అఫ్రీన్ గ్రాస్ శాలరీ ₹7,00,000.
నెట్ శాలరీ సూత్రం:
నెట్ శాలరీ = గ్రాస్ శాలరీ - అన్ని డిడక్షన్లు (ఆదాయపన్ను, పీఎఫ్, గ్రాట్యుటీ మొదలైనవి)
అఫ్రీన్ శాలరీ స్ట్రక్చర్‌ను బట్టి, ఆమె ₹5,00,000 నుండి ₹7,50,000 మధ్య సంపాదించే ఉద్యోగుల కోసం ఉన్న 10% ట్యాక్స్ స్లాబ్ కిందకు వస్తుంది.
అందువల్ల, ఆమె ₹33,637 పన్ను చెల్లించవలసి ఉంటుంది.
ఇప్పుడు, ఆమె నెట్ శాలరీ:
నెట్ శాలరీ = 7,00,000 - 33,637 - 84,000 - 29,629 = ₹5,52,734
మీరు ఇలా మీ గ్రాస్ శాలరీని, నెట్ శాలరీని లెక్కించవచ్చు. ఇది కొద్దిగా అయోమయంగా ఉండవచ్చు. కానీ ఒకసారి మీరు దాన్ని అర్థం చేసుకుంటే ఆ తర్వాత గందరగోళంగా ఏమీ అనిపించదు.
మీరు చేయాల్సిందల్లా ఆ సూత్రాలను వాడటమే. గుడ్ లక్!
పి.ఎస్. - ఇప్పుడు మీరు సంపాదించడం ప్రారంభించారు కదా, మరి పెట్టుబడి పెట్టడం కూడా ఇప్పటి నుంచే ప్రారంభిస్తే ఎలా ఉంటుంది?
ఎంత తొందరగా అయితే అంత మేలు. భవిష్యత్తులో మీకు మీరే ధన్యవాదాలు చెప్పుకుంటారు. మీకు డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడంలో ఆసక్తి ఉంటే ఈ ఆర్టికల్ చూడండి.