Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
ఆర్థిక లక్ష్యాలను గురించి, స్మార్ట్ (S.M.A.R.T.) లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం గురించి స్టెప్పులవారీగా వ్యూహాలు తెలుసుకోండి.
మీ జీవిత లక్ష్యాలు ఏమిటి? మీకు సొంత కారు కావాలా? సొంత ఇల్లు కావాలా? మీ పిల్లలను మంచి కళాశాలలో చేర్పించాలా?
లేదంటే మీకు ప్రపంచ యాత్ర చేయాలని ఉందా? మీ వయసు ఎంత, లక్ష్యం ఏమిటి అనేదానితో సంబంధం లేదు. మనం అందరం కూడా మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతో డబ్బు దాచుకుంటాము.
అవునా కాదా? అందువల్ల మీ ఆదాయం ఎంత ఉన్నా, ఏం లక్ష్యాలు ఉన్నా వాటితో సంబంధం లేకుండా మీ భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం ఒక మంచి ఆలోచన. ప్రపంచంలోని ఈ కుబేరుల ఆర్థిక సలహాలు మీ ప్రయాణంలో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ప్లాన్ చేసుకోవడానికి ముందు, మీరు ఒక స్పష్టమైన ఆర్థిక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి పెట్టుకోవడం అవసరం. మీకు ఏం కావాలి? దానికి ఎంత సమయం కావాలి?
అది సాధించడానికి ఏ అడుగులు వేయాలి? మీరు ప్రతీ లక్ష్యానికి ఒక తెలివైన, చేయగలిగిన ప్లాన్ వేసుకొని ఉండాలి.
ముందుగా బేసిక్స్‌తో మొదలు పెడదాం.
సంవత్సరానికి ఆరు అంకెల ఆదాయం సంపాదించడం లేదా నెలకు రూ. 10,000 ఆదా చేయడం లాంటి మీరు సాధించాలనుకునే డబ్బుకు సంబంధించిన లక్ష్యాలే ఫైనాన్షియల్ గోల్స్.
లేదా మరోవైపు, బీచ్ హౌస్ కొనుక్కోవడం లేదా విదేశాలకు విహారయాత్రకు వెళ్లడం వంటివి కూడా ఫైనాన్షియల్ గోల్స్ కావచ్చు.
బేసిక్‌గా మీ లక్ష్యం ద్రవ్య లక్ష్యం ద్వారా సూచించబడుతుంది. మీరు రెండు రకాల లక్ష్యాలు సాధించవచ్చు:
స్వల్పకాలిక లక్ష్యాలు: వచ్చే ఏడాది లేదా అంతకంటే తక్కువ కాలంలో మీరు సాధించాలనుకునే వాటిని స్వల్పకాలిక లక్ష్యాలు అంటారు.
స్వల్పకాలిక లక్ష్యాలకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:
● కొత్త ఫోన్ కొనడం.
● విహారయాత్ర కోసం మీ కుటుంబాన్ని థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లడం.
● క్రెడిట్ కార్డ్‌కు మొత్తం డబ్బులు కట్టేయడం
● ఎమర్జెన్సీ కోసం డబ్బులు దాచుకోవడం
● సైకిల్ కొనటం
దీర్ఘకాలిక లక్ష్యాలు: దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఒక అడుగు వెనక్కి వేసి, కొంచెం పెద్దగా ఆలోచించాలి.
ఇవి రాబోయే 2 సంవత్సరాలలో మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాల నుంచి రాబోయే 50 సంవత్సరాలలో మీరు చేరుకోవాలనుకునే లక్ష్యాల వరకు ఉంటాయి.
దీర్ఘకాలిక లక్ష్యాలకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:
● అభివృద్ధి చెందే చిన్న వ్యాపారం పెట్టడం.
● పెళ్లి చేసుకోవడం
● వెకేషన్ హోమ్‌లో పెట్టుబడి పెట్టడం
● లోన్ తీసుకోకుండా మీ పిల్లలను కాలేజీలో చేర్పించడం
● రిటైర్మెంట్ తర్వాత హాయిగా బతకడం
ఇప్పుడు గుర్తుంచుకోండి, లక్ష్యం-నిర్ధారణ విషయానికి వస్తే, దీర్ఘకాలిక లక్ష్యాలు, స్వల్పకాలిక లక్ష్యాలు ఉండటం ఎప్పుడూ మంచిదని గుర్తుంచుకోండి.
30 సంవత్సరాల దూరంలో ఉన్న లక్ష్యం కోసం ప్రతిరోజూ పని చేయడం కష్టం.
అవునా? కానీ మీకు వీక్లీ, మంత్లీ, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటే మీరు ముందుకు వెళ్లడానికి మీకొక పూల దారి ఏర్పడుతుంది.
ఫైనాన్షియల్ గోల్స్ విషయానికి వస్తే జీవితంలో మీరు సాధించాలనుకునే విషయాలను రాయడానికి కొంత సమయం కేటాయించండి.
జిడ్డుగా ఉండకండి. పెద్దగా ఆలోచించండి. చిన్న గోల్స్ సాధించడంతో మొదలు పెట్టండి.
ఆర్థిక వ్యూహాన్ని రూపొందించేటప్పుడు ఉపయోగించుకోవడానికి తెలివైన లక్ష్యాలు అద్భుతమైన పునాది.
అవి ప్రత్యేకంగా, చేరుకోగలిగేవిగా ఉండాలి. ఆ లక్ష్యాలు సాధించుకునే సమయం కూడా ముందే అనుకోవాలి.
మిమ్మల్ని మీరు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవడం ద్వారా ఇది సాధించవచ్చు.
మీకు ఏం కావాలో మీకే తెలియకపోతే మీరు కోరుకున్నది పొందలేరు. మామూలు అవసరాల నుంచి మీ అన్ని కోరికల జాబితా తయారు చేసుకోండి — కొత్త కారు వంటి ఆశ నుంచి, విలాసవంతమైన వెకేషన్ హోమ్ వరకు, ఏదైనా వీలైనంత నిర్దిష్టంగా చేయండి.
అది కారు అయితే, ఉదాహరణకు, బ్రాండ్, మోడల్‌ను నోట్ చేసుకోండి. మీరు పెళ్లి చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామితో కలిసి లిస్టు రాయండి, అప్పుడు మీరు మీ లక్ష్యాల కోసం కలిసి పని చేయవచ్చు.
ఎవరికైనా సరే, చేయవలసిన పనుల లిస్టులో రిటైర్మెంట్ సేవింగ్స్ ఖచ్చితంగా ఉండాలి; దీనిని మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, మీ అభివృద్ధి అవకాశాలు అంత మెరుగవుతాయి.
ఆర్థిక లక్ష్యాలను రాసుకోవడం ఎందుకు అంత కీలకం అని మీరు అనుకోవచ్చు. మీరు గుర్తించకుండా ఏదో ఆలోచిస్తూ ఉండవచ్చు.
ఇది పైకి చెప్పుకోలేనిది కాబట్టి, మీరు దానిని మీ మనస్సులో సరిగ్గా గుర్తించలేరు.
మీరు ఆ ఆలోచనను/భావనను మాటల్లో రాసినప్పుడు, దానిని వివరించడానికి ప్రయత్నించినప్పుడు, ఏదో అద్భుతం జరుగుతుంది.
రూపం లేని ఆ భావనకు ఇప్పుడు ఒక రూపం ఉంది. అదేదో లోపల ఉండిపోలేదు.
ఇది మిమ్మల్ని ఉత్తేజపరిచే విషయం లేదా మీకు గట్ రియాక్షన్ ఇచ్చే విషయం అవుతుంది.
మీరు మీ కలను రాసినప్పుడు, అది ఒక లక్ష్యం అవుతుంది. మీరు ఇల్లు కొనాలని అనుకుంటున్నారని అనుకుందాం. మీరు తరచుగా దాని గురించి ఊహించుకుంటారు.
అయితే, మీరు దానిని రాసిన వెంటనే, మీ మనస్సులో "ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని చదరపు అడుగులు, ఎన్ని బెడ్రూమ్లు?" అనే ఊహలు వస్తాయి.
ఇలా రాయడం మీ లక్ష్యాన్ని స్పష్టం చేసి దానిని సాధించే మార్గాల గురించి మీరు ఆలోచించేలా మీ ఆలోచనలను బలోపేతం చేస్తుంది.
మీ గోల్స్ లిస్ట్ పెద్దగా ఉండి ఉండవచ్చు. వాటిని ఒకేసారి సాధించడం ఆచరణాత్మకంగా అసాధ్యం.
మొదట్లో, ప్రస్తుతం మీకు అత్యంత అవసరమైన స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వండి.
విదేశీ పర్యటన కంటే మీ కూతురి పెళ్లి మీకు చాలా ముఖ్యమైనది. పొలం కొనడం కంటే ఇల్లు కొనడం చాలా అవసరం.
అయితే, మీ ప్రాధాన్యత లిస్టులో లేని గోల్స్ మీరు వదులుకోనవసరం లేదు. దానికి బదులుగా, వాటి వద్దకు తిరిగి రావడానికి ముందు ఆరు నెలలు కానీ, ఒక సంవత్సరం కానీ ఆగండి.
అప్పటికి మీరు మీ ముఖ్యమైన గోల్స్‌లో కొన్నింటిని పూర్తి చేసి ఉండవచ్చు. లేదా మిగిలినవి చేసుకోవడానికి వీలుగా అప్పటికి కొంత ఆదాయం పెరగవచ్చు.
మీరు చేయాలనుకుంటున్న వాటిలో వెంటనే సాధించగలిగేవి, కొంచెం ఎక్కువ సమయం పట్టేవి - ఇలా మీకు ప్రధానమైన గోల్స్‌ను విభజించుకోండి.
ప్రతీదానికీ ఒక తుదిగడువు పెట్టుకోండి. దానికి తగినట్టు ప్రతి నెలా కొంత డబ్బు దాచుకోండి.
మీ దాచుకున్న డబ్బును బట్టి మీరు దాన్ని ఎంత తొందరగా సాధించగలరు అనేది తెలుస్తుంది.
మీకు ఒక ఏడాదిలో కారు కావాలంటే మీరు ప్రతి నెలా ఎక్కువ డబ్బులు దాచుకోవాలి. ఒకవేళ మీరు రెండేళ్లలో కావాలనుకుంటే కొంచెం తక్కువ దాచితే చాలు.
అదొక టాప్ గోల్ అయినా, అంటే మీ పిల్లలకు ఫీజు కట్టడం లాంటిదైతే, మీరు దాచుకుంటూ ఉండవచ్చు. కానీ మీరు మానాల్సిన అవసరం లేదు.
మీ మైలురాళ్లకు ప్రత్యేకించి ఎక్కువ ఖర్చయ్యేవాటికి గోల్స్ సెట్ చేసుకోవడం మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఇది గుర్తుంచుకోండి: రూ. 10 లక్షలు ఆదా చేయడం కష్టంగా అనిపించవచ్చు, కానీ ప్రతి నెలా రూ. 10 వేలు ఆదా చేయడం పూర్తిగా సాధ్యమే.
మీకు వీలయ్యే దానిని చేయడం చాలా ముఖ్యం.
అది ఎప్పటికి కావాలి? దానికోసం ఎంత సమయం పడుతుంది? అనేది ఆలోచించుకొని సరిగ్గా ఊహించుకుని రాసుకొని ఉంచుకోవాలి.
పదేళ్ల తర్వాత చేయబోయే మీ అమ్మాయి పెళ్లి కోసం మీరు డబ్బు దాస్తున్నట్లయితే ఇవాళ్టి రోజున పెళ్లి చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది ముందుగా మీరు ఊహించి పెట్టుకోవాలి.
అప్పుడు, పదేళ్లలో రాబోయే మార్పులు గుర్తుపెట్టుకుని భవిష్యత్తు కోసం లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి.
మరొక ఉదాహరణ, మనం రూ. 10,000 లేదా రూ. 20,000 ఒక నెలకు దాచి పెడితే రెండేళ్లలో కారు కొనుక్కోవచ్చా?
కొన్నేళ్ళ తర్వాత ఇల్లు కొనాలంటే ఎంత అవుతుందనేది ఇవాళ్టి రోజున ఊహించడం కష్టం లేదా ఒక పదేళ్ళకు పిల్లలకు ఫీజు ఎంత అవుతుంది? ఇలాంటివి ఆలోచించుకోవడం కష్టం. కాబట్టి ఇప్పుడు మనం ఎంత దాచగలమో ఆలోచించుకొని మొదలు పెట్టడం మంచిది.
మొదట్లో మీరు చాలా తక్కువ డబ్బు దాచగలగవచ్చు. కానీ మీ జీతం పెరగడం, ప్రమోషన్ రావడం, ఆదాయం పెరగడం లాంటివి ప్రతీ ఏడాది జరుగుతాయి. మీరు పొదుపు చేసేవి అవసరానికి సహాయ పడతాయి.
డబ్బు పొదుపు చేసే అలవాటు ఎంత సులువో, ఉపయోగకరమో ఇప్పుడు తెలుసుకోండి.
మీ ఆర్థిక లక్ష్యాలకు డెడ్‌లైన్ పెట్టుకోవడం అవసరం అనిపించవచ్చు. నేను ఇల్లు ఎప్పుడు కొనుక్కోగలుగుతానో, నా కూతురు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుందని మీకు అనిపించవచ్చు.
ఏదేమైనా, మీకు అది తెలియకపోతే, మీరు ఆర్థికంగా దానికి సిద్ధంగా ఉండరు. మీరు ఆర్థికంగా సిద్ధంగా ఉంటే, అప్పటికి మీరు ఊహించుకున్నది జరగకపోయినా, ఏవైనా కారణాల వల్ల వాయిదా వేయబడినా మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు.
మీ లక్ష్యాలను చేరుకోవడానికి తగినంత డబ్బుతో మీరు అప్పటి నుంచి ఆర్థికంగా సిద్ధంగా ఉంటారు.
డెడ్‌లైన్ పెట్టుకోవడం మీ లక్ష్యాన్ని సాధించడానికి మానసికంగా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా, మీరు డెడ్‌లైన్ సెట్ చేసిన వెంటనే, మీ మనసులో కౌంట్ డౌన్ మొదలవుతుంది.
మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకోలేకపొతే మీరు ఆర్థిక వ్యూహాన్ని ఏర్పరుచుకోలేరు. ఒప్పుకుంటారా?
ఇప్పుడు మీరు మీ కలలను అణిచివేశారు. వాటిని సాకారం చేయడానికి ఒక ప్లాన్ వేసుకోవడానికి ఇదే సరైన సమయం. మీ ప్రతీ లక్ష్యానికి ఎంత ఖర్చవుతుందో మీరు తెలుసుకోవలసి ఉంటుంది, దీనికి కొంత రీసెర్చ్, కొంత లెక్కలు వేసుకోవడం అవసరం.
మీ ఆదాయం, ఖర్చుల ఆధారంగా, మీరు ప్రతీ గోల్‌ను ఎప్పుడు, ఎలా చేరుకోవాలి అనే దానికి మీరు ఒక ప్లాన్ వేసుకోవాలి.
ఇప్పుడు మీరు పొదుపు చేసుకోగలగడానికి కూడా బడ్జెట్ ఏర్పాటు చేయాలి. ప్రతీ లక్ష్యం కోసం ఎంత ఆదా చేయాలో మీకు తెలుసు.
మీరు ప్రతీ ఏడాది ఇలా చేస్తే, మీ ఆర్థిక ఆకాంక్షలన్నీ నిజమవుతాయి.
ఇలా చేస్తే మీరు అప్పులు లేకుండా లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి సిద్ధంగా ఉంటారు.
మీకు కావలసిందల్లా అంకితభావం, మంచి వ్యూహం. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి పై సలహాలను ఉపయోగించండి.
పర్సనల్ ఫైనాన్స్ గైడ్ కావాలా? విజయవంతమైన, ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక ఎందుకు అవసరమో పరిశీలించండి.
మీరు ఈ స్మార్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చిట్కాలతో మీ డబ్బు వ్యవహారాలను కూడా పెంచుకోవచ్చు.