Buy Gold
Sell Gold
Daily Savings
Round-Off
Digital Gold
Instant Loan
Nek Jewellery
జార్ యాప్‌లో ఉన్న ఆటో ఇన్వెస్ట్మెంట్ ఫీచర్ ద్వారా మీరు స్థిరమైన పొదుపుల ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఇప్పుడు మీరు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత ఎక్కువగా సంపాదించే ఆస్కారం ఉంటుంది.
స్థిరత్వం అనేది విజయానికి మూలం.
స్థిరత్వం కోసం ఇప్పటికీ చాలా మంది కష్టపడుతున్నారు. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
స్థిరత్వం అనేది ఆలోచించడానికి సులభంగానే ఉంటుంది. కానీ రోజువారి జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినపుడు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇది మీ సహనానికి పరీక్ష పెడుతుంది.
స్థిరత్వం అనేది కొత్త అలవాట్లను సృష్టిస్తుంది. ఈ కొత్త అలవాట్లను పాటించడం చాలా కష్టం. రోజూ జిమ్‌కి వెళ్లడం, డైట్ అనుసరించడం, నూతన సంవత్సరం ఏదైనా ఒక తీర్మానం చేసుకోవడం ఎలాగో అలాగే అన్నమాట.
మనం మన పాత అలవాట్లను ఎంత వదులుకుందామని ప్రయత్నించినా కూడా అవి మనలో పూర్తిగా ఇమిడిపోయి ఉంటాయి. వాటిని అంత తేలికగా వదులుకోలేము.
‘‘నేను చిన్నవైన స్థిరమైన అలవాట్లను అవలంభించాను. చివరికి నేను ప్రారంభించినపుడు అవి ఊహించలేని మార్పులను తీసుకొచ్చాయి” అని బాగా అమ్ముడు పోతున్న ‘అటామిక్ హ్యాబిట్స్’ అనే పుస్తక రచయిత జేమ్స్ క్లియర్ తెలిపారు.
అతడు చెప్పింది అక్షరాలా నిజం. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో, ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారో మధ్య గల తేడానే స్థిరత్వం (వాస్తవానికి).
డబ్బు ఆదా చేసే విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.
మీరు ఎంత సంపాదిస్తున్నారనేది ముఖ్యం కాదు. ఎంత డబ్బును పొదుపు చేస్తున్నారనేది చాలా ముఖ్యం. మీరు పరిమిత బడ్జెట్‌తో మీ అవసరాలు తీర్చుకుంటూంటే ప్రతీసారి ఎక్కువగా ఆదా చేసే అవకాశం ఉంటుంది.
కానీ చాలా మందికి స్థిరత్వం అనేది చాలా కష్టమైన పనిగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పదే పదే చేయాల్సి వచ్చినపుడు. అయినా చాలా మంది పొదుపు చేయలేకపోతున్నారు.
కొంత మంది పై పద్ధతికి పూర్తి వ్యతిరేకంగా చేస్తారు. సంపాదించే మొత్తం కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇలా చేయడం వలన మీకు నెలాఖరు వరకు ఏమీ మిగలకుండా పోతుంది. మీరు ఒక చట్రంలో చిక్కుకుపోతారు.
ఈ సాధారణ చట్రానికి బ్రేక్ చేయండి. ఈ రోజే పొదుపు చేయడం ప్రారంభించండి. మీరు ఎక్కడో ఓ చోట ప్రారంభించాలి కదా.
కానీ అది సరిపోదు. ఈ విషయం మీకు తెలుసా.. మీ సందర్భాలను బట్టి కూడా ఆదా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఎప్పుడూ వాడే వ్యూహాన్ని అనుసరించడం ఒక్కోసారి సవాలుతో కూడుకుంటుంది. మీరు డబ్బును ఆదా చేసే మీ ప్రయత్నాలలో చాలా స్థిరంగా ఉండాలి. ఇక్కడ కూడా అది చాలా ముఖ్యం.
ప్రతి నెలా మీరు పొదుపు చేయలేకపోయినా చిన్న మొత్తాలతో ప్రారంభించండి. సులభంగా రోజుకు కనీసం రూ. 10 పొదుపు చేయండి. ఇప్పుడు చూసేందుకు ఇది మీకు చిన్న మొత్తం లాగే కనిపించినా భవిష్యత్‌లో అది చాలా ఎక్కువవుతుంది. కానీ, మీరు స్థిరత్వం కోల్పోకుండా ఉంటేనే.
త్వరగా ప్రారంభించడం ఇక్కడ నిజంగా ముఖ్యమైన విషయమే. వీలైనంత త్వరగా ప్రారంభిచండి. ఇది మీకు కొన్ని అదనపు సంవత్సరాల కాంపౌండింగ్ను కూడా అందిస్తుంది. అంతేకాకుండా పొదుపు మొత్తాల సంఖ్యను ఎక్కువ చేస్తుంది. ఎక్కువ కాంపౌండింగ్ తేడాను కలిగి ఉంటుంది. ఇది మీ పదవీ విరమణ నిధులలో గణనీయమైన భాగం అవుతుంది.
ప్రారంభించేందుకు మీరు ఏం చేయగలరో ఇక్కడ ఉంది.
మీరు ఆర్థికంగా విజయవంతం కావాలంటే మీరు చేయాల్సింది ఒకటే. ప్రతినెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం. కానీ ఎంత మొత్తం పొదుపు చేస్తే ఆర్థికంగా విజయవంతమవుతాం అని చాలా మందిలో అనుమానం ఉంటుంది. ప్రతినెలా మీ జీతంలో 10 నుంచి 15 శాతం పొదుపు చేస్తే సరిపోతుంది.
సైడ్ బిజినెస్, ఫ్రీలాన్స్ ప్రాజెక్టుల వంటి అన్ని రిసోర్సుల నుంచి వచ్చిన డబ్బులను (పే చెక్‌లను) చేర్చండి. ఇది ఎంతో అవసరం. మీరు పదవీ విరమణ తీసుకున్నపుడు ఇది ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.
మీరు మొదటగా పొదుపు వ్యూహాన్ని పాటించినపుడు మీ జీతంలో 10 శాతం పొదుపు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ అలా అని దీనిని పూర్తిగా వదిలేయడం మంచిది కాదు.
మీరు భరించగలిగే పనులతో ప్రారంభించండి. మీ బడ్జెట్ మీకు అనుకూలంగా మారినప్పుడు మీరు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నించండి.
ప్రతీ నెలా మీ అవసరాలు తీర్చుకున్న తర్వాత మీ బడ్జెట్లో ఇంకా ఎంత డబ్బు ఉందో జాగ్రత్తగా అధ్యయనం చేయడం మొదలు పెట్టండి.
ఇప్పుడు ఎంత మొత్తం పొదుపు చేయాలో మీకు అవగాహన వచ్చి ఉంటుంది. తదుపరి దశ, ఈ ఆర్థిక లక్ష్యాలను ప్రతీ నెలా కాపాడుకోవడం, కొత్త ఆర్థిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం.
మీరు పొదుపు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. పొదుపు అనేది మీకు మీరు ఇచ్చుకునే డబ్బును సూచిస్తుంది. ఒక మొబైల్ ప్రొవైడర్, లేదా యుటిలిటీ కంపెనీ, లేదా రుణదాతలకు మీరు చెల్లించాల్సిన డబ్బు లాగానే ఇది కూడా అనుకోండి.
ప్రతీనెలా తప్పనిసరిగా పొదుపు చేయాలని మీరు కనుక భావిస్తే... పొదుపు చేయడం మరింత సులభం అవుతుంది.
స్థిరంగా ఉంటూ పొదుపును అలవాటు చేసుకోవడం మీకు కష్టంగా ఉన్నట్లయితే పొదుపును ఆటోమేట్ చేయండి. అవును ఆటోమేటిక్ పద్ధతి ద్వారా డబ్బులను పొదుపు చేయడం చాలా సులభంగా పూర్తవుతుంది.
జార్ యాప్ లాంటి ఒక ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకొని మీ డబ్బు పెరగడాన్ని చూడండి. ఇది మీ జీవన విధానాన్ని మీ జీతానికి తగినట్లు మార్చుకోవడంలో సాయపడుతుంది.
మీరు బ్యాంకులో డబ్బులను దాచడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. సంవత్సరాలైనా కానీ అది పెరగదు. పైగా ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ రోజురోజుకూ తగ్గిపోతుంది. (దీని గురించి ఇక్కడ మరింత చదవండి.)
ఇది మీ స్టైల్ కాదని అనుకోకండి. ప్రతీ ఒక్కరూ తమ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టాలి. మీకు పెట్టుబడి గురించి ఏమీ తెలియకపోతే ఏ మాత్రమూ చింతించకండి.
మనమంతా ఎక్కడో ఒక చోటు నుంచే ప్రారంభిస్తాం. అందుకే, మీ వంతుగా పరిశోధన చేయండి. ఎక్కువగా చదవండి. (ఇక్కడ మరిన్ని చిట్కాలను పొందండి). డిజిటల్ గోల్డ్ వంటి సురక్షితమైన ఆస్తితో మీ పెట్టుబడులను ప్రారంభించండి.
ఇక్కడే మీకు సాయం చేసేందుకు జార్ యాప్ ఉంది.
జార్ అనేది ఒక డైలీ గోల్డ్ సేవింగ్స్ యాప్. ఇది మీ డబ్బను పొదుపు చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇది మీ ఆన్లైన్ లావాదేవీలలో మిగిలిపోయిన మొత్తాన్ని ఆటోమేటిక్‌గా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతుంది.
జార్ అనేది పొదుపు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.
జార్‌తో మీరు 24 క్యారట్ల బంగారం పొందవచ్చు. మీ సంపదను పెంపొందించుకోవచ్చు. (మమ్మల్ని నమ్మడం లేదా? మీరే స్వయంగా చెక్ చేయండి). అత్యుత్తమ ధరలకు ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేయడమే గాక విక్రయించనూ వచ్చు. ఇక్కడ కేవలం రూ. 1 కి కూడా పెట్టుబడులు పెడుతూ ప్రారంభించవచ్చు.
డిజిటల్ గోల్డ్‌లో చిన్న మొత్తాలను ఆటోమేటిక్‌గా పెట్టుబడులుగా పెట్టే అలవాటును ఏర్పరచుకోండి. ఈ అలవాటు ద్వారా మీ పొదుపు పెరుగుతుంది. ఈ పొదుపును మీకు కావాల్సినప్పుడు ఎప్పుడైనా సరే మీ ఈ–వాలెట్స్‌లోకి రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మీరు జొమాటో వంటి వాటిలో రూ. 324 పెట్టి ఏదైనా ఆర్డర్ చేయండి. దాని పేమెంట్‌ను పేటీఎంతో పూర్తి చేయండి.
అప్పుడు జార్ మీరు ఖర్చు చేసిన మొత్తాన్ని రూ. 330 కి రౌండ్ ఫిగర్ చేస్తుంది. మిగిలిన రూ. 6ను (330-324) నేరుగా తీసుకెళ్లి డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతుంది. ఇది చాలా కూల్‌గా ఉంది కదూ. రూ. 6 చూసేందుకు మీకు చిన్న మొత్తంలాగే అనిపించినా... సమయం గడిచే కొద్దీ అది చాలా పెద్దదవుతుంది.
ఇక్కడ మీరు ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తే అంత ఎక్కువగా డబ్బును ఆదా చేస్తారు.
మీరు జార్ యాప్‌లోని ప్రీమియం డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లతో మైక్రో సేవింగ్స్ కూడా చేయవచ్చు (అత్యుత్తమ బంగారం ధరల వద్ద). ఇది 100 శాతం సురక్షితం. మీరు ప్రతీ బంగారం లావాదేవీలోనూ ఆటోమేటికల్‌గా 24 క్యారెట్ల బంగారం పొందుతారు.
జార్ యాప్‌ను వాడటం వలన మీరు మీ ఆర్థిక నిధులను పూర్తి నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. మీరు కేవలం ఒకే బటన్‌పై క్లిక్ చేసి మీ పెట్టుబడులను ఆపవచ్చు. లేదా తిరిగి ప్రారంభించవచ్చు. బంగారం పెట్టుబడుల మీద కూడా నియంత్రణ పొందవచ్చు.
మీరు జార్ యాప్‌లో ఆటో పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు లేదా మాన్యువల్‌గా అయినా పెట్టుబడులు పెట్టవచ్చు. అంతే కాదు, మీరు ఇక్కడ అనేక గేమ్స్ ఆడొచ్చు. మీ సేవింగ్స్‌ను రెట్టింపు కూడా చేసుకోవచ్చు.
స్పిన్ ది వీల్– జార్ యాప్‌లోని ప్రతీ లావాదేవీకి డబ్బును ఆదా చేసుకోండి. జార్ యాప్‌లో ప్రతీ లావాదేవీ మీకు వీల్ ఆఫ్ సేవింగ్స్‌లో ఒక స్పిన్‌ను అందజేస్తుంది. దీంతో జార్లోని మీ సేవింగ్స్ రెట్టింపయ్యే అవకాశం లేదా గేమ్స్ ఆడి అద్భుతమైన క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం పొందండి.
భవిష్యత్‌లో మీకున్న ప్రతీ ఆర్థిక లక్ష్యం కోసం ఒక జార్‌ను రూపొందించుకోండి.
జార్‌తో, మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు కస్టమ్ ‘జార్’లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలాంటి ఆర్థిక లక్ష్యాలంటే:
● మీ వివాహం కోసం బంగారం కొనుగోలు చేయడం
● తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం కోసం కానుక కొనేందుకు డబ్బులను పొదుపు చేయడం
● మీ తదుపరి సోలో లేదా ఫ్యామిలీ ట్రిప్ కోసం డబ్బును పొదుపు చేయడం
● పిల్లల చదువుల కోసం ఆర్థిక ప్రణాళికలు వేయడం
● ఏదైనా వ్యాపారం ప్రారంభించేందుకు గానీ, లేదా మీకు నచ్చిన స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు గానీ అవసరమయ్యే డబ్బు కోసం ప్లాన్ చేయడం
● డబ్బుపై, ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ కోసం డబ్బులను పొదుపు చేసుకోవడం
● సురక్షితమైన భవిష్యత్ కోసం డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయడం
● కలల కారు, ఇల్లు, ఫోన్ లేదా ల్యాప్‌టాప్ మొదలైనవి కొనుగోలు చేసేందుకు పర్సనల్ ఫైనాన్స్‌లను ప్లాన్ చేసుకోవడం
● అత్యవసర డబ్బు అవసరాల కోసం ప్లాన్ చేసుకోవడం
ఆసక్తిగా ఉందా? ఇక్కడ మరింత తెలుసుకోండి.
స్థిరత్వం కోసం ఉన్న మార్గం అంత సులభమైనదేమీ కాదు. ఈ మార్గంలో అనేక అవాంతరాలు ఉంటాయి.
ఆ అవాంతరాలను ఎదుర్కొనేందుకు, మీ జర్నీని సులభతరం చేసేందుకు జార్‌ను మీకు సాయం చేయనీయండి. ఈరోజే పొదుపు చేయడం ప్రారంభించండి. జార్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.