Playstore Icon
Download Jar App
Savings

ప్రతీరోజు చిన్న మొత్తాలను ఆదా చేసి ఏడాదికి రూ. 1,32,860 పొదుపు చేయండి!

December 29, 2022

మీరు ఒక ప్రారంభ స్థాయిలో ఉన్న ఇన్వెస్టర్​ అయితే ఎలా పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలో పూర్తిగా తెలుసుకోండి.

డబ్బే సర్వస్వం కాదు, కానీ ప్రతీదానికి డబ్బు కావాలి!

ఈ సామెత ఎప్పటికీ పాతబడదు. మన జీవితంలో డబ్బు ఉంటే అన్నీ సమకూరుతాయి. వస్తువులను కొనుగోలు చేయడమైనా, భవిష్యత్ కోసం పొదుపు చేయడమైనా, జీవితంలో కొన్ని ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం.

పొదుపు ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసినప్పటికీ పొదుపు చేయడం కొంత మందికి కష్టంగా ఉంటుంది. కొంత మందికి ఎక్కడ ప్రారంభించాలో తెలియదు.

చాలామంది లాగే మీకు కూడా డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలియకపోతే మీరేం చింతించకండి. మీరు వెంటనే ఈ 52వారాల మనీ చాలెంజ్​ను స్వీకరించండి. దీంతో మీ పొదుపు ప్రయాణాన్ని ప్రారంభించండి.

ఈ చాలెంజ్ (ఆర్టికల్) ముగిసే సమయానికి మీరు రెండు విషయాలను తెలుసుకుంటారు.

●     దాదాపు ఒక ఏడాది పాటు పొదుపు చేయడం చాలా సవాలుగా ఉంటుంది. 2023 చివరి నాటికి మీరు మంచి అమౌంట్​ను అందుకుంటారు. లేకపోతే..

●     జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజూవారీగా పొదుపు చేసే మంచి అలవాటును ఏర్పాటు చేసుకుంటారు.

దీనిని ప్రారంభించేందుకు మీరు చేయాల్సిందల్లా రోజుకు రూ. 2 ఆదా చేయడం. పొదుపు చేయడం చాలా కష్టమైన పని అని మీరు ఆలోచిస్తున్నారా? కానీ సేవింగ్స్ అనేవి చాలా సులభం.

మొదటి రోజు రూ. 2, రెండో రోజు రూ. 4 ఇలా పెంచుకుంటూ 365 రోజులు (సంవత్సరం) పాటు పొదుపు చేయండి. మీరు ఏడాదిలో రూ. 1,32,860 పొదుపు చేయగలుగుతారు. దీని ద్వారా మీ డబ్బు చాలా ఆదా అవుతుంది.

నెలకు రూ. 50,000 అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు ఈ సేవింగ్స్ ప్రోగ్రాం బాగా సరిపోతుంది. కానీ దీనిలో మీ లక్ష్యాన్ని మీ సౌకర్యాన్ని బట్టి సర్దుబాటు చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

మీరు తప్పకుండా ప్రతీరోజు డబ్బును పొదుపు చేయడం ప్రారంభిస్తే... మీ డబ్బు ఎలా రెట్టింపు అవుతుందో మీరు తెలుసుకోవచ్చు. మీరు ఇలా కనుక చేస్తే ఈ సంవత్సరం చివరి వరకు మీ వద్ద కొంత అమౌంట్​ ఉంటుంది.

మీరు ఇప్పుడు సంపదను ఎలా సృష్టించాలో తెలుసుకున్నారు కదా. ఈ సంపదను చక్రవడ్డీని ఉపయోగించి ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి.


చక్రవడ్డీ అంటే ఏమిటి?

ప్రపంచంలోని 8వ వింతగా పిలవబడే చక్రవడ్డీ మీ డబ్బును రెట్టింపు చేయడంలో సహాయపడుతుంది. మీరు మీ బ్యాంక్ అకౌంట్​కు డబ్బులు జమ చేస్తున్నంత కాలం ఇది రెట్టింపు చేస్తూనే ఉంటుంది.

డిపాజిట్లపై వచ్చే వడ్డీని చక్రవడ్డీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రారంభ మొత్తం, కాలక్రమేణా వచ్చే వడ్డీకి కూడా వర్తిస్తుంది.

చక్రవడ్డీని రోజువారీగా లేదా నెలవారీగా, లేదా సంవత్సరాల వారీగా కూడా చేయవచ్చు.

చక్రవడ్డీ గురించి తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?

సంవత్సరాల సంఖ్య పెరిగినపుడు చక్రవడ్డీ కూడా అదే విధంగా పెరుగుతూ పోతుంది.

మీరు పొదుపు చేయడం తొందరగా ప్రారంభిస్తే మీ సంపాదన పెరుగుతుంది. ఇంకా కాలక్రమేణా దానికి చక్రవడ్డీ కూడా జమ అవుతుంది.

మంచుతో కవర్ చేయబడిన వాలు మీద మీరు మంచుతో ఉన్న బంతిని పట్టుకుంటే... మీరు అధికంగా మంచును సేకరించగలరు. ఇప్పటికే మీ వద్ద ఉన్న మంచు అలాగే ఉంటుంది.

మీ పొదుపు ప్రయాణం ముగిసేసరికి... మీ ఆస్తులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రారంభించిన మొత్తానికి మరింత జమవుతుంది.

ఉదాహరణకు, వడ్డీ మీద వడ్డీ అనేది కాలక్రమేణా పెరుగుతూ లాభాలను తెచ్చిపెడుతుంది. డబ్బులను రెట్టింపు చేస్తూ ఉంటుంది.

తరచూ మీరు పొదుపు చేయడం వలన ఎక్కువ మొత్తాన్ని పొందగలుగుతారు. మీకు వడ్డీ కూడా అధికంగా వస్తుంది. దీనినే "చక్రవడ్డీ యొక్క మహత్యం" అంటారు.


అది మీ కోసం ఏం చేస్తుంది?

చక్రవడ్డీ అనేది మీ ఆస్తులను వేగవంతంగా వృద్ధి చేస్తుంది. మీరు చక్రవడ్డీ వ్యూహాన్ని అనుసరించినట్లు అయితే మీరు పొదుపు చేసిన సమయంలో డబ్బు మీద అధిక వడ్డీని పొందే అవకాశం ఉంటుంది.

ఈ వడ్డీ మీరు ఖాతాలో నిల్వ ఉంచిన మొత్తం డబ్బుపై ఉంటుంది. అంతేకాకుండా మీకు వచ్చే రాబడులపై కూడా పనిచేస్తుంది. అందుకే చక్రవడ్డీ అనేది త్వరగా మీ డబ్బును పెంచుతుంది.

దీని కారణంగా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు మీరు 365 రోజుల పాటు ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేయాల్సిన అవసరం లేదు.

పెరుగుతున్న సంపదను చూసుకుంటే.. చక్రవడ్డీ అనేది చాలా శక్తివంతమైన సాధనంగా పని చేస్తుంది. మీ పొదుపు శక్తిని పెంచేందుకు ఇంట్రెస్ట్-బేరింగ్ అకౌంట్​ను ఓపెన్ చేయండి. ఇది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.

జీవన వ్యయం పెరిగిపోవడం, ద్రవ్యోల్బణం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం వంటి వాటిని ఈ వ్యూహంతో తగ్గించుకోవచ్చు.


చక్రవడ్డీ లాభాన్ని ఎక్కువ పొంది తమ డబ్బును పెంచుకునేందుకు ప్రారంభ దశలోని ఇన్వెస్టర్లు అనుసరించాల్సిన ఉత్తమ మార్గాలు ఏమిటి?

చక్రవడ్డీ ప్రయోజనాలను పొందేందుకు మీరు ప్రతినెలా ముందుగా నిర్ణయించిన విధంగా పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం. దీనిని ఇది వరకే చర్చించాము.

అయితే మీ డబ్బును మరింత పెంచుకోవడానికి అవసరమైన ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.


మీ ఖర్చులపై నియంత్రణ ఉంచుకోండి

మీరు రూ. 100 పెట్టుబడి పెట్టినా లేదా రూ. 1000 పెట్టుబడి పెట్టినా చక్రవడ్డీ అనేది సమానంగా పనిచేస్తుంది. కాబట్టి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ వడ్డీని సంపాదించండి.

చక్రవడ్డీ ప్రయోజనాలను పొందేందుకు మీరు మీ పెట్టుబడులను పెంచండి. మీరు అదనపు ఖర్చులను తగ్గించుకోవడం వలన మీ పొదుపును పెంచుకోవచ్చు.

నెలవారీ బడ్జెట్​ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా, డబ్బు పొదుపు చేయగల అంశాలను గుర్తించడం ద్వారా దీన్ని చేయవచ్చు.

మీరు జాగ్రత్తగా పొదుపు చేస్తే మీ డబ్బును సులభంగా ఆదా చేసుకోవచ్చు, పెట్టుబడులు అధికంగా పెట్టొచ్చు. ఈ విధానం ద్వారా మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.


మీరు ఎంత తొందరగా మొదలుపెడితే అంత మంచిది

పెట్టుబడుల విషయానికి వస్తే ఎక్కడా మనం అనుకున్న ప్రారంభం లభించదు. అందుకే మీరు సంపాదించడం ప్రారంభించిన వెంటనే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి.

అయితే మీరు ఇప్పటికే ఆ స్థితికి చేరుకున్నట్లయితే.. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు.

డిజిటల్ గోల్డ్​ లేదా మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టండి. వీటితో మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోండి. వీటిలో చక్రవడ్డీ మీకు సాయం చేస్తుంది. మీరు జీవితంలో అభివృద్ధి చెందడానికి, పేరు తెచ్చుకోవడానికి బలమైన పునాదిని నిర్మించుకోవచ్చు.

పెట్టుబడిపై రాబడిని ఎలా గుర్తించాలో తెలియకపోతే ఇంట్రెస్ట్​ క్యాలుక్యులేటర్ మీకు బాగా ఉపయోగపడుతుంది.

మీ దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకునేందుకు పొదుపు చేయడం ఎందుకు అవసరమో అంచనా వేయగల ఆన్​లైన్ క్యాలుక్యులేటర్​ను కనుగొనడం చాలా సులభం.


స్వీయ నియంత్రణ కలిగి ఉండండి

మీరు ఒక మంచి పోర్ట్​ఫోలియో (మంచి ఫైనాన్షియల్​ ఇన్వెస్ట్​మెంట్లతో కూడినది) నిర్మించుకోవాలని అనుకుంటే, మీ ఆర్థిక లక్ష్యాలను సమయానికి చేరుకోవాలని అనుకుంటే క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు పెట్టడం అవసరం.

ప్రారంభంలోనే పెట్టుబడులను పెట్టడం ఒక అలవాటుగా చేసుకోవడం వలన ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చు. మీరు సిప్​ పేమెంట్లను దాటవేయకూడదు.

ప్రతినెలా స్థిరంగా పెట్టుబడులు పెట్టడం వలన మీ డబ్బు పెరగడం మాత్రమే కాకుండా మీ పెట్టుబడి క్రమశిక్షణ కూడా పెరుగుతుంది.

మీరు కనుక ఆర్థికంగా విజయం సాధించాలంటే ఈ ప్రవర్తనను తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.


ఓపికగా ఉండటం నేర్చుకోండి

చాలా సార్లు యువ ఇన్వెస్టర్లు త్వరగా ఎక్కువ లాభాలు వచ్చే పెట్టుబడుల కోసం వెతుకుతూ ఉంటారు.

కానీ త్వరగా డబ్బు సంపాదించాలనే ఆతృతలో వారు విలువైన తప్పులను చేయడం మనం గమనించవచ్చు. కానీ మనం ఇదివరకే చూసినట్లు చక్రవడ్డీ వల్ల డబ్బు కాలక్రమేణా పెరుగుతుంది.

పెట్టుబడులను దీర్ఘకాలిక దృష్టితో చూడటం వలన ప్రయోజనం ఉంటుంది. నెమ్మదిగా పెట్టుబడులు పెట్టుకుంటూ దీర్ఘకాలంలో నెమ్మదిగా చెల్లించవచ్చు.

చక్రవడ్డీ ప్రయోజనాలను తెలుసుకునేందుకు మీరు ఒక ఆర్థిక నిపుణుడు అయి ఉండాల్సిన పని లేదు. ప్రతీ ఇన్వెస్టర్​ ఈ సూత్రాన్ని అడ్వాంటేజ్​గా తీసుకొని మంచి ఫలితాలు పొందవచ్చు.

మంచి భవిష్యత్​ కోసం ఇప్పుడే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించండి.

తరచూ క్రమశిక్షణతో కూడిన పొదుపు చేయడం వలన మీరు చక్రవడ్డీని అందించే ఆస్తులలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇవి మీరు పదవీ విరమణ పొందే సమయానికి పెద్ద మొత్తంలో డబ్బును అందజేస్తాయి.

 

 

Subscribe to our newsletter
Thank you! Your submission has been received!
Oops! Something went wrong while submitting the form.